Mohammed Shami : సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు మౌనం వీడిన షమీ..
సానియా మీర్జాని మహ్మద్ షమీ పెళ్లి చేసుకోనున్నాడనే వార్తలు గత కొంతకాలంగా వస్తున్నాయి.

Shami Breaks Silence On Rumours Of Marriage With Sania
Shami-Sania Mirza : భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెట్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన కుమారుడితో కలిసి దుబాయ్‌లో నివాసం ఉంటున్నారు. మరోవైపు టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు మహ్మద్ షమీ కొంతకాలంగా తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో త్వరలోనే సానియా మీర్జాని మహ్మద్ షమీ పెళ్లి చేసుకోనున్నాడనే వార్తలు గత కొంతకాలంగా వస్తున్నాయి. ఇప్పటికే వీటిపై సానియా మీర్జా తండ్రి స్పందించగా.. తాజాగా మహ్మద్ షమీ దీనిపై స్పష్టత నిచ్చాడు.
వన్డే ప్రపంచకప్ అనంతరం చీలమండల గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. కాగా.. ఇటీవల అతడు ఓ యూట్యూబ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సమయంలో సానియాతో పెళ్లి రూమర్ గురించిన ప్రశ్న షమీకి ఎదురైంది. ఈ వార్తలపై షమీ అసహనం వ్యక్తం చేశాడు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నాడు. ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నాడు.
Mohammed Shami : అర్ష్‌దీప్ పై ఇంజమామ్ వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన షమీ.. వీళ్లంతే..
సోషల్ మీడియాలో ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేసే వారికి నాదొక హెచ్చరిక. మీరు చేసే మీమ్స్ వల్ల ఎంతో మంది బాధపడతారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఏదైన వార్తను షేర్ చేయాలి అని అనుకున్నప్పుడు అందులో నిజం ఎంత ఉందో తెలుసుకోవాలి. ఒకవేళ తప్పుడు ప్రచారం చేయాలని భావిస్తే.. అప్పుడు మీ అసలైన ఖాతాల(వెరిఫైడ్) నుంచి పోస్ట్ చేయాలి. అప్పుడు వాటికి సరైన సమాధానం చెబుతా అంటూ షమీ అన్నాడు.
సానియా మీర్జా తండ్రి ఏమన్నాడంటే..?
జూన్ నెలలోనే ఈ వార్తలపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించాడు. అవన్నీ చెత్త వార్తలు అని అందులో నిజం లేదన్నాడు. ఇప్పటి వరకు షమీని సానియా ఒక్కసారి కూడా కలవలేదన్నాడు. ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డాడు.
Harbhajan Singh : ఏంటదీ.. పాక్ జర్నలిస్ట్ పై హర్భజన్ ఆగ్రహం.. ఈ రోజుల్లో కూడానా..