Harbhajan Singh : ఏంట‌దీ.. పాక్ జ‌ర్న‌లిస్ట్ పై హ‌ర్భ‌జ‌న్ ఆగ్ర‌హం.. ఈ రోజుల్లో కూడానా..

టీమ్ఇండియా మాజీ ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌కు కోపం వ‌చ్చింది.

Harbhajan Singh : ఏంట‌దీ.. పాక్ జ‌ర్న‌లిస్ట్ పై హ‌ర్భ‌జ‌న్ ఆగ్ర‌హం.. ఈ రోజుల్లో కూడానా..

Harbhajan Slams PAK Journalist For Comparing Dhoni and Rizwan

Harbhajan Singh – PAK Journalist : టీమ్ఇండియా మాజీ ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌కు కోపం వ‌చ్చింది. ఓ పాకిస్తాన్ జ‌ర్న‌లిస్ట్ చేసిన ప‌నికి భ‌జ్జీ ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. స‌ద‌రు పాక్ జ‌ర్న‌లిస్ట్‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. ఇంత‌కీ ఆ పాకిస్తాన్ జ‌ర్న‌లిస్ట్ ఏం చేశాడు. హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఎందుకు అంత‌లా రియాక్ట్ అయ్యాడో చూద్దాం..

టీమ్ఇండియాకు రెండు(వ‌న్డే, టీ20) ప్ర‌పంచ‌క‌ప్‌లు అందించిన మ‌హేంద్ర సింగ్ ధోనితో పాకిస్తాన్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌ను పోలుస్తూ పాక్ జ‌ర్న‌లిస్ట్ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. వీరిద్ద‌రిలో ఎవ‌రు అత్యుత్త‌మం అంటూ ఆ ఫోటోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. దీన్ని చూసిన హర్భ‌జ‌న్‌కు కోపం వ‌చ్చింది. కాస్త ఘాటుగానే స్పందించాడు. ప్ర‌పంచ క్రికెట్‌లో నంబ‌ర్ వ‌న్‌గా పేరుగాంచిన ధోనితో పెద్ద‌గా అనుభ‌వం లేని ఓ ఆట‌గాడిని పోల్చ‌డం స‌రైంది కాద‌న్నాడు.

IND vs PAK : అదరగొట్టారు.. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో పాక్‌ను చిత్తుచేసిన భారత మహిళల జట్టు

ఇక్క‌డ రిజ్వాన్ బ్యాటింగ్ స‌త్తాను తాను త‌క్కువ చేయ‌డం లేద‌ని, ధోనితో స‌రితూగే ప్లేయ‌ర్ మాత్ర‌మే కాద‌ని భ‌జ్జీ చెప్పుకొచ్చాడు. ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం దారుణం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రిజ్వాన్ కంటే ధోనీ ఎంతో ముందు ఉన్నాడని తెలిపాడు. మీ ప్ర‌శ్న‌కు నిజాయితీగా స‌మాధానం చెబుతున్నాను. రిజ్వాన్ ఆట అంటే నాకు ఇష్ట‌మే. అత‌డు నిబ‌ద్ధ‌త‌తో ఆడేందుకు ఎప్పుడూ ప్ర‌య‌త్నిస్తుంటాడు. అయితే.. ధోనితో అత‌డిని పోల్చ‌డం మాత్రం ముమ్మాటికీ త‌ప్పే. అని భ‌జ్జీ అన్నాడు.

ఇక ధోని ఇప్ప‌టికి కూడా వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా ఉంటాడు. ఇలాంటి వికెట్ కీప‌ర్లు చాలా అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో ఎప్ప‌టికీ ధోనినే నంబ‌ర్ వ‌న్ అంటూ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ చెప్పాడు.

Natasa Stankovic : విడాకుల ప్ర‌క‌ట‌న త‌రువాత‌.. హార్దిక్ పాండ్యా భార్య తొలి పోస్ట్‌..

ఇదిలా ఉంటే.. 44 ఏళ్ల హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఇటీవ‌ల ఇంగ్లాండ్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ‌ల్స్ 2024టోర్న‌మెంట్‌లో పాల్గొన్నాడు. 7 మ్యాచుల్లో 6.66 ఎకాన‌మీతో 8 వికెట్లు తీశాడు. ఫైన‌ల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ‌ల్స్ విజేత‌గా నిలిచింది.