Natasa Stankovic : విడాకుల ప్ర‌క‌ట‌న త‌రువాత‌.. హార్దిక్ పాండ్యా భార్య తొలి పోస్ట్‌..

టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, న‌టాషా స్టాంకోవిచ్‌ల వైవాహిక బంధానికి తెర‌ప‌డింది.

Natasa Stankovic : విడాకుల ప్ర‌క‌ట‌న త‌రువాత‌.. హార్దిక్ పాండ్యా భార్య తొలి పోస్ట్‌..

Natasa Stankovic drops adorable video of son Agastya after split with Hardik Pandya

Updated On : July 19, 2024 / 4:40 PM IST

Natasa Stankovic – Hardik Pandya : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, న‌టాషా స్టాంకోవిచ్‌ల వైవాహిక బంధానికి తెర‌ప‌డింది. తాము విడాకులు తీసుకోనున్న‌ట్లుగా గురువారం రాత్రి సోష‌ల్ మీడియా వేదిక‌గా హార్దిక్‌, న‌టాషాలు ప్ర‌క‌టించారు. కాగా.. గ‌త కొంత‌కాలంగా వీరిద్ద‌రు విడిపోనున్నార‌నే వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే బుధ‌వారం తెల్ల‌వారుజామున న‌టాషా త‌న కుమారుడు అగస్త్యతో క‌లిసి ముంబై నుంచి సెర్బియాకు వెళ్లింది. వీరిద్ద‌రూ ముంబై విమానాశ్ర‌యం నుంచి వెలుతున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా.. విడాకుల ప్ర‌క‌ట‌న త‌రువాత స్టాంకోవిచ్ త‌న సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోల‌ను, వీడియోను పోస్ట్ చేసింది.

Andrew Flintoff : వామ్మో.. ఇంగ్లాండ్ దిగ్గ‌జ ఆట‌గాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు మామూలోడు కాదుగా..

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో న‌టాసా పోస్ట్ చేసిన వీటిలో ఆమె త‌న కుమారుడితో స‌మ‌యం గ‌డుపుతున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. ఒక ఫోటోలో ఆమె తన కొడుకు నిద్రపోతున్నప్పుడు అతనిని తన చేతుల్లోకి తీసుకువెళ్లడం చూడవచ్చు.

వీడియోలో.. అగస్త్య మొక్కల దగ్గర తోట ప్రాంతంలో బంతిని పట్టుకుని కనిపించాడు. మ‌రో ఫోటోలో అగ‌స్త్య సోఫాలో తెల్లటి లాబ్రడార్‌తో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

IND vs SL : వ‌న్డేల్లో సూర్య‌కుమార్‌ను ఎందుకు తీసుకోలేదు.. రెండు ఫార్మాట్ల‌లో ప‌రాగ్‌కు ఛాన్స్ ఎందుకిచ్చారంటే..?

2019 డిసెంబ‌ర్ 31న సెర్బియా న‌టి అయిన న‌టాషా స్టాంకోవిచ్‌కు హార్దిక్ పాండ్య ఉంగ‌రం తొడిగి త‌న ప్రేమ‌ను తెలియ‌జేసి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. 2020 లాక్‌డౌన్ స‌మ‌యంలో వీరు వివాహం చేసుకున్నారు. అదే ఏడాది జూన్‌లో వీరికి అగ‌స్త్య జ‌న్మించాడు. గ‌తేడాది వీరిద్ద‌రూ మ‌రోసారి వివాహం చేసుకున్నారు. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పుర్ ప్యాలెస్‌లో హిందూ, క్రిస్టియ‌న్ ప‌ద్ద‌తుల్లో పెళ్లి చేసుకున్నారు.