IND vs SL : వన్డేల్లో సూర్యకుమార్‌ను ఎందుకు తీసుకోలేదు.. రెండు ఫార్మాట్లలో పరాగ్‌కు ఛాన్స్ ఎందుకిచ్చారంటే..?
అదే సయమంలో సూర్యకు వన్డే జట్టులో స్థానం దక్కలేదు.

Why was Suryakumar not picked for ODIs How did Riyan Parag find place in both squads
India vs Sri Lanka : ఈ నెలాఖరులో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సెలక్టర్లు కొన్ని ఊహించని మార్పులు చేశారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్‌గా ను కాదని సూర్యకుమార్ యాదవ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అదే సయమంలో సూర్యకు వన్డే జట్టులో స్థానం దక్కలేదు.
వన్డేల్లో సూర్యకు నో ప్లేస్..
టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ ఎలా ఆడతాడో అందరికి తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో సూర్య ఒకడు. అయితే.. వన్డేల విషయానికి వచ్చే సరికి మాత్రం అతడు తడబడుతున్నాడు. ముఖ్యంగా స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో అతడు ఘోరంగా విఫలం అయ్యాడు. ఇప్పటి వరకు సూర్య 37 వన్డేలు ఆడగా 25.76 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో అతడు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.
Virat Kohli : బీసీసీఐకి కోహ్లీ భరోసా.. గంభీర్ విషయంలో.. అనుమానాలు అక్కరలేదు..!
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు కేవలం 6 వన్డేలు మాత్రమే ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయ ఆటగాళ్లపై దృష్టి పెట్టాలని సెలక్టర్లు భావించారు. ఈ క్రమంలోనే సూర్యపై వేటు వేశారు.
హార్దిక్ పాండ్యా కూడా..
ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే హార్దిక్‌కు టీ20 కెప్టెన్సీ దక్కలేదని తెలుస్తోంది. గాయాల కారణంగా అతడు తరచూ జట్టుకు దూరం అవుతున్నాడు. జట్టుతో పాటు నిరంతరం ఉండే ఆటగాడు, కెప్టెన్సీ ఇచ్చినా ఆటపై ప్రభావం పడని ఆటగాడిని కెప్టెన్‌గా చేయాలని గంభీర్ కోరడంతో సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఇక సూర్యలాగానే హార్దిక్ సైతం వన్డే జట్టుకు దూరం అయ్యాడు. వన్డేల్లో హార్దిక్‌కు ప్రత్యామ్నాయం లేదు. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌లో జరగనుండడంతో బౌలింగ్ ఆల్‌రౌండర్ కావాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందట. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లపై దృష్టి పెట్టారు.
టీ20లకు రవీంద్ర జడేజా రిటైర్‌మెంట్ ప్రకటించడంతో అతడిని వన్డేలకు సైతం పక్కన పెట్టారు. అక్షర్ పటేల్ భీకర ఫామ్‌లో ఉండడం ఓ కారణం కాగా.. వాషింగ్టన్ సుందర్ పై ఫోకస్ చేయడం మరోకారణంగా తెలుస్తోంది. ఇక యువ ఆటగాడు రియాన్ పరాగ్‌కు టీ20, వన్డే జట్టులో స్థానం లభించింది. దేశవాలీ క్రికెట్‌లో పరాగ్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అంతేకాకుండా అతడు విజయ్ హజారే ట్రోపీలో నిలకడగా రాణించాడు. లోయర్ ఆర్డర్‌లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండడంతో అతడికి రెండు జట్లలో స్థానం లభించేందుకు కారణమైంది.
Ishan Kishan : ఇషాన్ కిషన్ దారెటు..? టీమ్ఇండియాలో రీ ఎంట్రీ కష్టమేనా..? ఒక్కటే మార్గం..!