IT Raids: ఏపీలో ఐటీ రైడ్స్ కలకలం.. మూడు నగరాల్లోని హోటల్స్‌లో ముమ్మర తనిఖీలు
కంప్యూటర్ డేటాతో పాటు రికార్డులు కూడా పరిశీలిస్తున్నారు. ఆన్ లైన్ పేమెంట్ ద్వారా చెల్లించిన డబ్బులు, బై హ్యాండ్ ద్వారా చెల్లించే నగదు విషయంలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
IT Raids: ఏపీలో మూడు నగరాల్లోని హోటల్స్ పై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. వైజాగ్, నెల్లూరు, రాజమండ్రిలోని హోటల్స్ లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హోటళ్లలో ఆన్ లైన్ పేమెంట్స్, డిజిటల్ కంప్యూటర్ డేటాను పరిశీలిస్తున్నారు అధికారులు. నెల్లూరులోని హోటల్ లో గతంలోనూ తనిఖీలు చేసిన అధికారులు పేమెంట్స్, ట్యాక్స్ మధ్య తేడాను గుర్తించారు. మరోసారి అదే హోటల్ లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. సోదాల విషయం బయటకు రాకుండా హోటల్స్ యజమానులు చూస్తున్నారు.
విశాఖలో సెలబ్రేషన్ రెస్టారెంట్ పై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఇదే రెస్టారెంట్ కి చెందిన మొత్తం నాలుగు బ్రాంచుల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఐటీ పన్ను ఎగవేస్తున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. కంప్యూటర్ డేటాతో పాటు రికార్డులు కూడా పరిశీలిస్తున్నారు. ఆన్ లైన్ పేమెంట్ ద్వారా చెల్లించిన డబ్బులు, బై హ్యాండ్ ద్వారా చెల్లించే నగదు విషయంలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఉదయం 11 గంటల నుంచి కూడా తనిఖీలు చేస్తున్నారు. లావాదేవీలు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది అధికారులు గుర్తించిన తర్వాత ఏమైనా లోపాలు ఉంటే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Also Read: విద్యుత్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన.. రైతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున..
