Snakes : పాములు అంతరించిపోవటం వల్ల .. ఆడబిడ్డలకు వివాహాలు కావటంలేదట

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. మరెన్నో అంతరించిపోయే ప్రమాదకర దశలో ఉన్నాయి. అలా పాములు అంతరించిపోవటంవల్ల ఆడపిల్లలకు వివాహాలు జరగటం కష్టంగా మారింది. మరి పాములకు, ఆడపిల్లల వివాహాలు జరగకపోవటానికి సంబంధమేంటీ..

Sanwara tribe snakes Dowry

Chhattisgarh Sanwara tribe snakes Dowry : ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఎన్నో రకాల జీవజాతులు అంతరించిపోతున్నాయి. మరెన్నో అంతరించిపోయే దశలో ఉన్నాయి. అలా పాముల్లో ఎన్నో రకాల జాతులు అంతరించిపోవటం వల్ల ఓ గిరిజన జాతి తెగలోని ఆడపిల్లలకు వివాహాలు కావటంలేదట..మరి పాములు అంతరించిపోవటానికి వారి ఆడపిల్లలకు వివాహాలు కాకపోవటానికి సంబంధం ఏంటీ..? అనే విషయం..ప్రకృతికి..భారతదేశంలోని వింత వింత సంప్రదాయాలకు గల సంబంధమని చెప్పాలి.

ఎందుకంటే..భారతదేశం విభిన్న కులాలు, మతాలు,జాతులు,తెగల మేళవింపు. ఎన్నో ఆచారాలు,మరెన్నో వింత వింత సంప్రదాయాలు. మరి ముఖ్యంగా గిరిజనలు వారి సంప్రదాయాలను వదులుకోవటానికి అస్సలు ఇష్టపడరు. దాంట్లో భాగమే వారి జాతిలో ఆడపిల్లల వివాహం సంప్రదాయంలో పాములు ముడిపడి ఉన్నాయి. పాములు లేకుండా వారి ఇంటి ఆడపిల్లలకు వివాహాలు జరగవు. ఆడపిల్లలు మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్న ఈరోజుల్లో కూడా ఆడపిల్ల వివాహం అంటే మొదటిగా గుర్తుకొచ్చేది ఇవ్వాల్సిన అతిముఖ్యమైనది ‘వరకట్నం’.. కట్నం అంటే డబ్బు,నగలు, వాహనాలు, ఇళ్లు, విలువైన వస్తువులు ఇస్తారు.

Clocks Gift from God : వింత ఆచారం..సిగరెట్ వెలిగిస్తే ఈ దేవుడు కోరికలు తీరుస్తాడట..!!

కానీ మనం ఇప్పుడు చెప్పుకునే గిరిజన జాతిలో వారి ఇంటి ఆడపిల్ల జరగాలంటే కట్నంగా పాముల్ని ఇవ్వాలి. మరి ముక్యంగా తొమ్మిది జాతులకు సంబంధించి 21 పాముల్ని కట్నంగా ఇవ్వాలి. కానీ పాములు అంతరించిపోవటం వల్ల వారి పూర్వీకలు 60 పాముల్ని కట్నంగా ఇచ్చేవారట. కానీ పాములు అంతరించిపోవటం వల్లా..తొమ్మిది రకాల జాతుల్ని ఇవ్వలేకపోతున్నామని అలాగే తమ పూర్వీకుల వలె 60పాముల్ని ఇవ్వలేక 21 పాముల్నే ఇస్తున్నామని చెబుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని కొర్బా ప్రాంతానికి చెందిన గిరిజన తెగలో ఆడపిల్లకు పాములను కట్నం(snakes Dowry )గా ఇచ్చే ఆచారం ఉంది. ఇది వారికి వందల ఏళ్లుగా వస్తోంది. ఆ ఆచారాన్ని వారు ఆనాటికి కొనసాగిస్తున్నారు. పెళ్లిలో సన్వారా తెగలోని వధువు తరఫువారు వరుడికి 9 రకాల జాతులకు చెందిన 21 పాములను అల్లుడికి కానుకగా ఇస్తారు. కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లను సన్వారా తెగ(Sanwara tribe)లో ఎవరూ పెళ్లి చేసుకోరు. కానీ పాముల సంఖ్య తగ్గిపోవటం వల్ల మా పూర్వీకులు 60 పాములను ఇవ్వలేక మాకు దొరికినవి..మా వద్ద ఉన్నవాటినే ఎన్నో కొన్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నామని చెబుతున్నారు సన్వారా తెగ గిరిజన నాయకుడు.

No Entry For Women In Temple : ఆ ఊరిలో వింత ఆచారం.. ఆ గుడిలోకి ఆడవాళ్లకు నో ఎంట్రీ, ఎందుకో తెలుసా

‘‘పాములు లేకుండా మా ఇంటిలో ఆడపిల్లలకు వివాహాలు కావు..కచ్చితంగా పాముల్ని కట్నంగా ఇస్తేనే వివాహం జరుగుతుంది..కానీ అలా పాముల జాతులు అంతరించిపోతుండటం వల్ల మా ఆడపిల్లలకు వివాహాలు కావటం కష్టమపోతోందని వాపోయాడు సన్వారా తెగ గిరిజన నాయకుడు.

కాగా పాముల్ని పట్టుకోవటం వాటిని ఆడించి జీవించటం అనేది కూడా నేరమంటున్నారు అటవీశాఖ అధికారులు. అటువంటిది పాముల్ని కట్నంగా ఇవ్వటం వల్ల పాములు ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి తరలించటం కూడా నేరమంటున్న ఈనాటి పరిస్థితుల్లో సర్వారా తెగలోని ఆడపిల్లలకు వివాహాలు కష్టంగా మారుతున్నాయని వాపోతున్నారు గిరిజనులు.

 

ట్రెండింగ్ వార్తలు