Free Raiton: ఈ నెల నుంచి తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణీ

రెండు నెలలుగా రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ చేయని సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోతే రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ నిలిపివేస్తామని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖ రాసింది.

Free Raiton: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ఈ నెల నుంచి వచ్చే డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఒక్కొక్కరికీ కేంద్రం అందించే ఐదు కిలోల ఉచిత బియ్యంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుందని గంగుల వెల్లడించారు.

Doctor dies: బిల్డింగ్‌పై నుంచి పడి డాక్టర్ మృతి

ఈ నెల 18-26 వరకు బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. రెండు నెలలుగా రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ చేయని సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోతే రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ నిలిపివేస్తామని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖ రాసింది. అలాగే రైస్ మిల్ల్లుల్లో బియ్యం బస్తాలు మాయమవుతున్నాయని, దీనిపై రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరింది. మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేవని, ఉన్న కొద్దిపాటి నిల్వలకు సంబంధించి సరైన లెక్కలు లేవని ఎఫ్‌సీఐ లేఖలో పేర్కొంది. ఎఫ్‌సీఐ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీకి ముందుకొచ్చింది. సాంకేతిక కారణాలతోపాటు, ధాన్యం సేకరణ పనుల వల్లే బియ్యం పంపిణీ చేయలేకపోయామని గంగుల అన్నారు. రాష్ట్రంలో 90.46 లక్షల రేషన్ కార్డులు ఉంటే, కేంద్రం 53 లక్షల కార్డులను మాత్రమే గుర్తించిందని, వాటికి మాత్రమే కేంద్రం బియ్యం పంపిణీ చేస్తోందని మిగిలిన వాటికి రాష్ట్ర ప్రభుత్వమే బియ్యం అందిస్తుందని ఆయన అన్నారు.

Somu Veerraju: ఉద్యోగిపై దాడి ఘటనలో టీటీడీ స్పందించాలి: సోము వీర్రాజు

రెండేళ్లక్రితం కరోనా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2020 ఏప్రిల్ నుంచి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా కేంద్రం రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేసింది. కాగా, రెండు నెలలుగా ఉచిత బియ్యం పంపిణీ చేయకపోవడంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మంత్రి గంగుల ప్రకటనతో వారందరికీ లబ్ధి చేకూరనుంది.

ట్రెండింగ్ వార్తలు