Hijab Row: ‘హిజాబ్‌ను వ్య‌తిరేకించే వాళ్లను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తా’

‘హిజాబ్‌ను వ్య‌తిరేకించే వాళ్లను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేసా’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Karnataka Hijob Row

Karnataka Hijab Row : కర్ణాటకలో హిజాబ్ వివాదంపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. ఈ వివాదం పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గటంలేదు. రాజకీయ రచ్చ రేపుతోంది హిజాబ్ వివాదం గురించి మరింత వివాదంగా వ్యాఖ్యలు చేశారు క‌ర్ణాట‌క కాంగ్రెస్ నాయ‌కుడు ముఖ‌రం ఖాన్. ‘హిజాబ్‌ను వ్య‌తిరేకించే వాళ్లను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తాన‘అంటూ ముఖరం ఖాన్ హెచ్చ‌రించారు. ఖాన్ వ్యాఖ్యలపై క‌ర్ణాట‌క పోలీసులు ఆయనపై గురువారం (ఫిబ్రవరి 17,2022) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Also read : Hijab Row : హిజాబ్ వివాదం.. కర్నాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బురాగిలో నిర్వ‌హించిన ఓ స‌మావేశానికి ముఖ‌రం ఖాన్ హాజ‌రయ్యారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘హిజాబ్‌ను వ్య‌తిరేకిస్తే ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తాను. ఇక్క‌డే పుట్టాం.. ఇక్క‌డే చ‌చ్చిపోతాం.. జీవితం ఉన్నంత వ‌ర‌కు భారతీయుడిగానే జీవిస్తా..హిజాబ్ ను ఎవ‌రైతే వ్య‌తిరేకిస్తున్నారో వాళ్లను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తాను. ఏదో ఒక రోజు మ‌నమంతా చ‌నిపోయేవాళ్ల‌మే…ఈ చిన్నపాటి జీవితంలో మతాల గురించి వివాదం చేయటం..అవమానపరచటం సరికాదు..ప్రతీ చిన్న విషయానికి మ‌తాల‌ను అంట‌గ‌ట్ట‌డం స‌రికాదు. అన్ని కులాలను, మ‌తాలను స‌మానంగా చూడాలి. ఎవరైనా వారికి ఇష్టమైనది ఏదైనా ధ‌రించొచ్చు. మిమ్మ‌ల్ని ఎవ‌రైనా అడ్డ‌గిస్తే.. ఊరుకునే స‌మ‌స్య లేద‌ని, ఇలాంటి చ‌ర్య‌ల‌ను స‌హించ‌బోం‘ అంటూ ముఖ‌రం ఖాన్ వ్యాఖ్యానించారు. ముఖరం ఖాన్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వ్యాఖ్య‌ల‌పై క‌ర్ణాట‌క పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also read : Hijab Row: ‘హిజాబ్‌ను బహిరంగ ప్రదేశాల్లో వేసుకుంటే ఊరుకోం’

కాగా..జనవరిలో కర్ణాటకలో ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో కళాశాలలో కొంతమంది విద్యార్థులు హిజాబ్ ధరించి వచ్చారనే కారణంతో క్లాసులకు హాజరు కాకుండా యాజమాన్యం అడ్డుకుంది. ఈ ఘటనతో కర్ణాటకలో హిజాబ్ నిరసనలు ప్రారంభమయ్యాయి. నిరసనల సందర్భంగా..కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి కాలేజీలోకి రానివ్వటంలేదని నిరసన్ చేపట్టారు. వారికి వ్యతిరేకంగా మరికొంతమంది విద్యార్థులు కాషాయ తలపాగాలు పెట్టుకుని వచ్చారు.

Read Also: ‘మేలి ముసుగు, తలపాగాలకు లేనిది హిజాబ్‌కు అనుమతివ్వరా’
ఉడిపి జిల్లాలోని పలు కళాశాలల్లోనూ ఇటువంటి పరిస్థితులే ఉన్నాన్నాయి. దీంతో కొన్ని రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవురు ఇచ్చారు. అలా కొన్ని రోజులకు తిరిగి ప్రారంభమైన విద్యాసంస్థలు తిరిగి అదే హిజాబ్ వివాదం కొనసాగుతోంది. ఈ వివాదం కాస్తా కర్ణాటక హైకోర్టుకు చేసింది. ప్రస్తుతం హిజాబ్ వివాదంపై కోర్టు విచారిస్తోంది.విద్యార్థులు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన యూనిఫాం మాత్రమే ధరించవచ్చని, కాలేజీల్లో ఇతర మతపరమైన ఆచారాలను అనుమతించబోమని పేర్కొంటూ ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ బోర్డు సర్క్యులర్ విడుదల చేయటంతో ఇది కాస్తా పెను వివాదంగా మారింది.

 

ట్రెండింగ్ వార్తలు