Chevireddy Mohith Reddy : వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్!
Chevireddy Mohith Reddy : ఈ కేసులో నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- Sreehari A
- Published On : July 27, 2024 / 10:40 PM IST
Chevireddy Mohith Reddy in Police Custody ( Image Source : Google )
Chevireddy Mohith Reddy : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కారుపై జరిగిన హత్యాయత్నం ఘటనలో విచారణను తిరుపతి పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
Read Also : YS Sharmila: అన్న వైఎస్ జగన్‌తో తాడోపేడో తేల్చుకునే దిశగా షర్మిల!
ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని కారుపై దాడికి సంబంధించి మోహిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. నాని ఫిర్యాదుతో పలువురిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత కేసుకు సంబంధించిన పలువురిని జైలుకు తరలించారు.
గత మే 14వ తేదీన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన హత్యాయత్నం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. దాంతో 307 సెక్షన్ కింద హత్యాయత్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
Read Also : CM Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటం
