NTR – Allu Sirish : ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పిన అల్లు శిరీష్.. వాళ్ళని కూడా కౌగలించుకొని..

ఓ ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పాడు.

Allu Sirish great Comments about NTR goes Viral

NTR – Allu Sirish : మన హీరోలంతా కలిసిమెలిసి ఉంటారని తెలిసిందే. అభిమానులు ఫ్యాన్ వార్స్ చేసుకున్నా హీరోలు మాత్రం ఎప్పుడు కలిసినా ఫ్రెండ్స్, రిలేటివ్స్ లాగా చాలా క్లోజ్ గా ఉంటారు. పలువురు హీరోలు కూడా మేమంతా బాగుంటాం అని గతంలో పలుమార్లు తెలిపారు. మన టాలీవుడ్ అందరి హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంది. తాజాగా అల్లు శిరీష్ ఎన్టీఆర్ గురించి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పారు.

అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమా ఆగస్టు 2 రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మూవీ యూనిట్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో దిగిన ఫోటో చూపించగా అల్లు శిరీష్ ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పాడు.

Also Read : Ravi Teja: డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, హీరో రవితేజ మధ్య విభేదాలు?

అల్లు శిరీష్ మాట్లాడుతూ.. అది ఒక పార్టీలో దిగిన ఫోటో. ఎన్టీఆర్ అందరితో చాలా క్లోజ్ గా ఉంటారు. ఫ్రెండ్స్, ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా అందరితో ఒకేలా ఉంటారు. నేను ఆ పార్టీలో చూసాను. ఆయనతో ఫోటో దిగడానికి అక్కడ డ్రైవర్స్, క్యాటరింగ్ వాళ్ళు ఎవరు వచ్చినా నన్ను హగ్ చేసుకున్నట్టే వాళ్ళని కూడా దగ్గరికి తీసుకొని కౌగలించుకుంటారు. చాలా ఓపికగా ఫోటోలు ఇస్తారు. నేను హీరో అని, తెలుసు అని కౌగలించుకోలేదు. అందరితో ఎన్టీఆర్ అలాగే ఉంటాడు. ఫ్యాన్స్ మన హీరో అనే ఫీలింగ్ తో వస్తారు. ఎన్టీఆర్ కూడా అదే ఫీలింగ్ తో వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. అందుకే నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం అని తెలిపాడు. దీంతో అల్లు శిరీష్ చేసిన కామెంట్స్ ని ఎన్టీఆర్ అభిమానులంతా తెగ వైరల్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు