Thank You Movie: థాంక్ యూ.. విక్రమ్ కుమార్‌కు, చైతూ బ్రేకిస్తాడా?

నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ థాంక్యూ. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో లవర్ బాయ్ గా ప్లజెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు నాగచైతన్య.

Thank You Movie: నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ థాంక్యూ. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో లవర్ బాయ్ గా ప్లజెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు నాగచైతన్య. ఎప్పుడో రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

Thank You Movie : మాస్కోలో మైనస్ 14 డిగ్రీస్‌లో చైతు-రాశీ ఖన్నా..

అక్కినేని ఫ్యామిలీ ప్యాక్ తో, మనం సినిమా చేసి, విక్రమ్ కె కుమార్ గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. ఆతర్వాత అఖిల్ తో ఇండివిజ్యువల్ గా హలో చేసినా, బాక్సాఫీస్ ముందు డిజాస్టర్గా మిగిలింది హలో.. తర్వాత సూర్యతో 24 కూడా విక్రమ్ కె కుమార్ కి విజయాన్నందించలేకపోయింది. నానితో చేసిన గ్యాంగ్ లీడర్ యావరేజ్ రిజల్టే ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ నాగచైతన్యతో థాంక్యూ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు విక్రమ్ కె కుమార్.

Thank You Movie : కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో నాగ చైతన్య..

నాగచైతన్య ఇప్పుడు రూట్ మార్చాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. వాటిలో కూడా ఒకదానికి మరో దానికి వేరియేషన్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన బంగార్రాజు సక్సెస్ తో మంచి జోష్ మీదున్నాడు. థాంక్యూలో క్లాస్ అండ్ ప్లజెంట్ లుక్ లో కనిపించి, ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేశారు. జులై 8న థాంక్యూ చెప్పడానికి వస్తున్నట్టు ప్రకటించి ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు. విక్రమ్ కుమార్ అండ్ నాగచైతన్య, మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తోన్న నాగచైతన్య విక్రమ్ కె కుమార్ కి థాంక్యూతో మరోసారి బ్రేక్ నిస్తాడా అని అక్కినేని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

Thank You Brother : ఏప్రిల్ 30న అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్!’.. రిలీజ్ పోస్టర్ లాంచ్ చేసిన నాగ చైతన్య..

థాంక్యూలో నాగచైతన్య సరసన రాశిఖన్నా నటిస్తోంది. మాళవికా నాయర్, అవికా గోర్ ఈ సినిమాలో కీ రోల్స్ లో కనిపించబోతున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జులై 8న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సక్సెస్ నాగచైతన్య కన్నా విక్రమ్ కె కుమార్ కే కీలకంగా మారింది అంటున్నారు సినీ అభిమానులు.

ట్రెండింగ్ వార్తలు