అజ్ఞాతంలో పిన్నెల్లి సోదరులు..! ఎక్కడికెళ్లారు? ఏమయ్యారు?

పోలింగ్ రోజు నుంచి మాచర్లలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ కనిపించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది.

Palnadu Violence : పల్నాడు జిల్లాలో పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాత్రి వారిద్దరూ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటివరకు తిరిగి రాలేదు పిన్నెల్లి సోదరులు. పిన్నెలి రామకృష్ణా రెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామి రెడ్డి.. ఇరువురు కూడా రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ ఇప్పటివరకు రాలేదు అంటే.. అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు పోలీసులు.

పోలింగ్ రోజు నుంచి మాచర్లలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ కనిపించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. పిన్నెల్లి సోదరుల ప్రమేయంతోనే ఘర్షణలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పిన్నెల్లి సోదరులు సడెన్ గా కనిపించకుండా పోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Also Read : చంద్రబాబుకు భద్రత పెంపు.. ఏపీలో జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఇంటెలిజెన్స్ హెచ్చరిక

ట్రెండింగ్ వార్తలు