18 Pages : టైప్ చేసే అక్ష‌రాల‌కి ఎమోష‌న్స్ ఉండ‌వంటున్న నందిని..

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో నిఖిల్, మ‌లయాళీ ముద్దుగుమ్మ అనుప‌మా పరమేశ్వరన్ జంట‌గా ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ‘18 పేజీస్’..

18 Pages: యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్, మ‌లయాళీ ముద్దుగుమ్మ అనుప‌మా పరమేశ్వరన్ జంట‌గా ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ‘18 పేజీస్’.. మెగాప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణలో, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, ‘100% లవ్’, ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’, ‘గీత‌ గోవిందం’, ‘ప్ర‌తిరోజూ పండుగే’ వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌తో స‌క్స‌ెస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన యంగ్ నిర్మాత బ‌న్నీ వాసు నిర్మాత‌గా జీఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు ‘ఉప్పెన’ వంటి స‌న్సెషేన‌ల్ హిట్ అందుకుని విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్న సుకుమార్ రైటింగ్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జూన్ 1న నిఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘18 పేజీస్’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. నిఖిల్ క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి, వాటి పై అనుప‌మ..
‘‘నా పేరు నందిని
నాకు మొబైల్ లో అక్ష‌రాలను టైప్ చెయ్య‌డం క‌న్నా
ఇలా కాగితం పై రాయ‌డం ఇష్టం
టైప్ చేసే అక్ష‌రాల‌కి ఎమోష‌న్స్ ఉండ‌వు
ఎవ‌రు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి, కానీ
రాసే ప్ర‌తి అక్ష‌రానికి ఒక ఫీలింగ్ ఉంటుంది
దానిపై నీ సంత‌కం ఉంటుంది
నాకెందుకో ఇలా చెప్ప‌డ‌మే బాగుంటుంది’’..
అని రాస్తున్న స్టిల్‌తో ఈ పోస్టర్ ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్‌తో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. క్రెజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత మందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా తెలియజేయనున్నారు..

 

ట్రెండింగ్ వార్తలు