Natural Farming : ప్రకృతి విధానంలో కొత్త ఒరవడి.. శబరి 555తో చీడపీలకు చెక్

Natural Farming : సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలంతోపాటు లాభాల బాట పట్టొచ్చని నిరుపిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా, ఏ కొండూరు మండలం, ఏ. కొండూరు గ్రామానికి చెందిన రైతు పల్లబోతుల శభరినాథ్.

Natural Farming : రసాయన ఎరువులతో పండించిన పంట దిగుబడుల నుంచి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండటం, ఖర్చులు కూడా అంతకంతకూ పెరుగుతుండటంతో రైతు శబరినాథ్ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు.  ఎనిమిదేళ్లుగా సహాజ పద్ధతుల్లో మామిడి, వరి తదితర పంటలు పండిస్తూ.. తాము పండించిన పంట దిగుబడులను వీలైనంత వరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి నికరాదాయం పొందుతున్నారు. మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం అనర్థాలకు తావిస్తోంది.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

మట్టిలో సత్తువ తగ్గి.. సాగుకు మేలుచేసే సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయి. ఈ క్రమంలో ఖర్చు నానాటికీ పెరుగుతూ.. గిట్టుబాటు దక్కక..  రైతులు అనేక ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రకృతి సాగు దిశగా ఒక్కో అడుగు పడుతోంది. సాగు ఖర్చులు తగ్గించుకుని.. సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలంతోపాటు లాభాల బాట పట్టొచ్చని నిరుపిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా, ఏ కొండూరు మండలం, ఏ. కొండూరు గ్రామానికి చెందిన రైతు పల్లబోతుల శభరినాథ్.

ప్రకృతి మామిడి.. శబరి 555 ద్రావణం :
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మామిడి క్షేత్రాన్ని చూడండీ.. ఎంత పచ్చగా కనిపిస్తోందో.. ఈ తోటకు ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. కాయలపై ఎలాంటి మచ్చలు లేవు.. కాసిన ప్రతి కాయ ఆకర్షనీయంగా కనిపిస్తోంది. ఇలా ఉండటానికి రైతు ఎలాంటి రసాయన ఎరువులు, మందులను పిచికారి చేయాలేదు. పలు రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ అనుభవాలను రంగరించి రైతు శబరినాథ్, తక్కువ ఖర్చుతో పోషక ద్రావాలను తయారు చేసుకొని  తన వ్యవసాయ క్షేత్రంలోని పంటలకు అందిస్తున్నారు. ముఖ్యంగా శభరి 555 అనే రకం ద్రావణం తయారు చేసి తన పంటలకు ముందస్తుగా పిచికారి చేయడంతో చీడపీడలు దరి చేరలేదు.

రైతు సుభాష్‌ పాలేకర్, చింతల వెంకటరెడ్డి వంటి నిపుణులు సూచించిన రసాయన రహిత సేద్య పద్ధతులను అవసరం మేరకు అనుసరిస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. వచ్చిన దిగుబడులను నేరుగా వినియోదారులకు అధిక ధరకు అమ్ముతున్నారు. ఒక మామిడే కాకుండా దేశవాళి బియ్యం, పప్పులు, చిరుధాన్యాలను ప్రాసెస్ చేసి అమ్ముతూ.. అధిక ఆదాయం పొందుతున్నారు.

ఆలోచనకు శ్రమతో కూడిన ఆచరణ తోడైతే విజయపుబాటలో పయనించవచ్చు అనటానికి నిదర్శనం ఈ రైతు. పరిస్థితులకు అనుగుణంగా సాగులో మార్పులు చేసుకుంటూ.. ముందడగు వేస్తే ఒడిదుడుకులు ఎదురైనా విజయం సొంతం అవుతుందనే సూత్రాన్ని ఆయన బాగా నమ్మారు. అందుకే తన క్షేత్రంలో పండ్లు, పప్పులు, చిరుధాన్యాలు.. ఇంటి అవసరాలకు ఉపయోగపడేవన్ని ప్రకృతి విధానంలో పండిస్తూ.. తనతో పాటు వినియోదారుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మంచి లాభాలను పొందుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

ట్రెండింగ్ వార్తలు