Offline Whatsapp Trick: ఈ ట్రిక్‌తో ఇంటర్నెట్ ఆఫ్ చేయకుండానే.. మీ వాట్సాప్‌ ఆఫ్‌లైన్ చేయొచ్చు..!

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌ను మిలియన్ల మంది యూజర్లు వాడుతున్నారు. చాలామందికి వాట్సాప్‌లో తెలియని ట్రిక్స్ చాలానే ఉన్నాయి. వాట్సాప్ అవసరమైనప్పుడు ట్రిక్స్ వాడొచ్చు.

Offline Whatsapp Trick: ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌ను మిలియన్ల మంది యూజర్లు వాడుతున్నారు. చాలామందికి వాట్సాప్‌లో తెలియని ట్రిక్స్ చాలానే ఉన్నాయి. వాట్సాప్ వినియోగదారులు తమకు అవసరమైనప్పుడు ఆయా ట్రిక్స్ వాడుతుంటారు. వాట్సాప్ చాట్ ఓపెన్ చేయకుండానే ఏ మెసేజ్ వచ్చిందో తెలుసుకోనే అవకాశం ఉంది. అలానే ఇప్పుడు మరో కొత్త ట్రిక్ కూడా ఉంది. ఈ ట్రిక్ ద్వారా మీరు ఆన్ లైన్ లో ఉన్నా కూడా ఆఫ్ లైన్ లో ఉన్నట్టుగా చూపించవచ్చు. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు.. ఏముంది.. డేటా ఆఫ్ చేస్తే సరి.. అలా కాదు.. ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేయకుండానే మీ వాట్సాప్ ఆన్ లైన్ కాకుండా ఆఫ్ లైన్ మోడ్ లో పెట్టొచ్చు.. అప్పుడు వాట్సాప్ లో మిమ్మల్ని గమనించేవారికి మీరు ఆన్ లైన్‌లో లేరనే నమ్మించవచ్చు. ఒకవేళ వాట్సాప్ ఆన్‌లైన్‌లో పెడితే మీకు నోటిఫికేషన్లు వస్తుంటాయి. అదే ఇంటర్నెట్ డేటా ఆపేస్తే అసలే డేటా నిలిచిపోతుంది.

కేవలం వాట్సాప్ మాత్రమే ఆఫ్ లైన్ చేసేందుకు ఈ ట్రిక్ ట్రై చేయండి.. ఇక్కడ మీరు ఇంటర్నెట్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. నెట్ ఆఫ్ చేయకుండా వాట్సాప్ ఆఫ్ చేసేందుకు ఇలా చేయండి. ముందుగా Google Play Storeలోకి వెళ్లండి. అక్కడ Pause It App అనే యాప్ కోసం సెర్చ్ చేయండి.. (4 రేటింగ్ స్టార్) ఆ యాప్ డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేసుకోండి. అనంతరం ఆ యాప్ ఓపెన్ చేయగానే.. మీ ఫోన్లో ఇన్ స్టాల్ అయి రన్ అవుతున్న అన్ని యాప్స్ లిస్టు కనిపిస్తుంది. Active Apps ఆప్షన్ వద్ద టోగుల్ (Toggle) బటన్ Press చేయండి. అప్పుడు మీకు యాప్స్ కనిపిస్తాయి. అందులో వాట్సాప్ యాక్టివ్ స్టేటస్ (Active) ఇన్ యాక్టివ్ చేసేయండి. అంతే.. వాట్సాప్ మాత్రమే డేటా ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఎంత సమయం వరకు వాట్సాప్ ఆఫ్ లైన్ మోడ్ లో ఉంచుతారో టైమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అంతే.. మీరు వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉండి కూడా ఆఫ్ లైన్ లో కనిపిస్తుంది.

మరో ట్రిక్ కూడా ఉంది.. డేటా ఖర్చు కాకుండా వాట్సాప్ వినియోగించాలంటే ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది. మీరు వాట్సాప్ లో డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు. మొదట వాట్సాప్ ఓపెన్ చేసి.. టాప్ రైట్ కార్నర్‌లో మూడు నిలువు చుక్కలపై గట్టిగా నొక్కండి. వాట్సాప్ Settingsలోకి వెళ్లాలి. అక్కడే మీకు Storage Option కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. అంతే.. మీ డేటా తక్కువగా ఖర్చు అవుతుంది. మీరు కాల్ ఇన్ డేటాను తగ్గించుకోవచ్చు. అందుకు మీరు వాట్సాప్ Toggle ఆన్ చేయండి. మీరు వాట్సాప్ లోని ఫోటోలు, వీడియోల నుంచి డేటా వినియోగాన్ని కూడా నిలిపివేయొచ్చు. మీరు ముందుగా Settings లోకి వెళ్లాలి. డేటా, స్టోరేజి వినియోగంపై క్లిక్ చేయాలి. మొబైల్ డేటా ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో టిక్ మార్క్ ఎంపిక్ తొలగించండి. ఒకవేళ Wi-Fi ద్వారా వాట్సాప్ కనెక్ట్ అయితే.. రోమింగ్ చేసేటప్పుడు రెండు ఇతర ఆప్షన్లలో ఒకే విధానాన్ని రిపీట్ చేసుకోవచ్చు.
Read Also :  Diwali : దీపావళి ఫుల్ జోష్, పెద్ద మొత్తంలో పండుగ ఖర్చుకు రెడీ

ట్రెండింగ్ వార్తలు