Threads APP: థ్రెడ్స్‌ యాప్‌లో ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేస్తే మళ్లీ తొలగించలేరు.. తొలగించాలంటే?

మెటా సంస్థ ఆధ్వర్యంలో ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్స్‌తో థ్రెడ్స్ యాప్‌ను రూపొందించింది. దీనిని ప్రారంభించిన కొద్ది గంటల్లోనే పది మిలియన్ల మంది సైన్‌అప్ కావటం విశేషం.

Mark Zuckerberg

Threads APP Account: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ (Twitter)కు పోటీగా మెటా సంస్థ సరికొత్తగా ‘థ్రెడ్స్’ యాప్‌ (Threads App)ను అందుబాటులోకి తెచ్చింది. థ్రెడ్స్ యాప్ ప్లే‌స్టోర్‌లో అందుబాటులోకి వచ్చిన తొలి రెండు గంటల్లోనే రెండు మిలియన్ల మంది, నాలుగు గంటల్లో ఐదు మిలియన్ల మంది సైన్అప్ చేసుకున్నారు. ప్రస్తుతం పది మిలియన్ల మందికిపైగా థ్రెడ్స్ యాప్‌ను సైన్‌అప్ చేశారు. గంటగంటకు థ్రెడ్స్ దూకుడును చూస్తుంటే ట్విటర్‌ను అధిగమిస్తుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఒక్కసారి థ్రెడ్స్ యాప్ సైన్‌అప్ చేస్తే దానిని తొలగించలేము. తొలగించాలంటే పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

Threads App Features: థ్రెడ్స్ యాప్ వచ్చేసింది.. యూజర్లు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి..

మెటా సంస్థ ఆధ్వర్యంలో ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్స్‌తో థ్రెడ్స్ యాప్‌ను రూపొందించింది. కోట్లాది మంది ఈ యాప్‌ను సైన్ అప్ చేసుకుంటున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒక్కసారి థ్రెడ్స్ యాప్ సైన్అప్ చేస్తే దానిని డిలీట్ చేయాలంటే సాధ్యం కాదు. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగిస్తేనే అది సాధ్యమవుతుంది. థ్రెడ్స్‌ను వినియోగించాలంటే మీరు ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన పనిలేదు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా థ్రెడ్స్ యాప్‌లో సైన్‌అప్ అవ్వాల్సి ఉంటుంది. థ్రెడ్స్ యాప్‌ను ఇన్ స్టాగ్రామ్‌తో లింక్ చేయడం ద్వారా ఇన్ స్టాగ్రామ్ ఖాతాను రద్దు చేస్తేనే థ్రెడ్స్ యాప్ రద్దయ్యే అవకాశం ఉంది.

Mark Zuckerberg : జుకర్ బర్గ్ ట్విట్టర్ లో రీ ఎంట్రీ.. 11 ఏళ్ల తర్వాత తొలి పోస్టు

ఈ విషయంపై మెటా తన అధికారిక బ్లాక్‌లో వెల్లడించింది. మీరు ఎప్పుడైనా మీ థ్రెడ్ ఫ్రొపైల్‌ను తొలగించవచ్చు. కానీ, మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించడం ద్వారా మాత్రమే మీ థ్రెడ్ ప్రొఫైల్ తొలగించబడుతుందని స్పష్టంగా పేర్కొంది. దీంతో మెటా సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ తెలివైన పనికి యూజర్లు కంగుతింటున్నారు. ఇదిలాఉంటే.. నెట్‌ప్లిక్స్, అమెజాన్, ఎన్ఎఫ్ఎల్, పెప్సీతో సహా అనేక బ్రాండ్‌లు ప్లాట్ ఫారమ్‌కు సైన్అప్ చేయడం ద్వారా థ్రెడ్స్‌పై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశాయి.

ట్రెండింగ్ వార్తలు