Women Power : చిన్నారి మాటలకు ప్రియాంకా గాంధీ ఫిదా

బాలికల హక్కుల గురించి..మహిళా హక్కుల పోరాటం గురించి మాట్లాడుతున్న ఓ చిన్నారి మాటలకు ప్రియాంకా గాంధీ ఫిదా అయిపోయారు. బాలిక వీడియోను షేర్ చేశారు.

Priyanka Gandhi fida powerful message on women power : ఓ చిన్నారి మాటలకు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఫిదా అయిపోయారు. ‘ చిన్నారి స్నేహితురాలు ఇచ్చిన సందేశం ఇది అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. యూపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రియాంకా గాంధీ యూపీ రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. బీజేపీ రాజకీయాలను ఎండగడుతున్నారు. అలా యూపీ పాలిటిక్స్ లో తలమునకలైన ప్రియాంకాగాంధీ ఓ చిన్నారి మాటలకు ఫిదా అయిపోయారు.

Read more : UP Lakhimpur : మరోసారి చీపురు పట్టిన ప్రియాంక

యూపీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్న ప్రియాంకా గాంధీ ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉండే ఆమె ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను ప్రజలతో పంచుకుంటుంటారు. ఈక్రమలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో ఓ చిన్నారి మహిళల పోరాటం గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడింది. హక్కులు అంటే ఏంటో..అందులోను మహిళా హక్కులు అనేవి ఉంటాయనీ..వాటి కోసం పోరాడాలని..అన్యాయం జరిగితే ప్రశ్నించాలని కూడా తెలియని వయస్సులో ఆ చిన్నారి మహిళా హక్కుల గురించి మాట్లాడటం చాలా ఆసక్తికరంగా మారింది. పైగా మహిళా హక్కుల కోసం ఆ చిన్నారికి ఉన్న అవగాహన చిన్ననాటే ఆమెకున్న మెచ్యూరిటీకి నిదర్శనంగా కనిపిస్తోంది.

Read more : UP Lakhimpur : మరోసారి చీపురు పట్టిన ప్రియాంక

ఈ వీడియోలో ఆ చిన్నారి హిందీలో ‘నేను ఓ బాలికను. అయితే నా హక్కుల కోసం ధైర్యంగా పోరాడతాను. అదేవిధంగా పోరాడే ప్రతి బాలిక, మహిళ పక్కన ధైర్యంగా నిలబడతాను’ అని ఆ చిన్నారి చెప్పిన మాటలకు వేలాదిమంది నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రియాంకా గాంధీ కూడా ఫిదా అయిపోయారు. ఈ వీడియో షేర్‌ చేస్తూ..‘నా చిన్నారి స్నేహితురాలు అందించిన సందేశం’, అనే క్యాప్షన్‌, # వుమెన్‌ పవర్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించారు.ఈ వీడియోను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లైకులు, కామెంట్ల వర్షం కురిపించారు నెటిజన్లు.

 

 

ట్రెండింగ్ వార్తలు