Lok Sabha Election 2024 : ఐదో విడత లోక్‌స‌భ‌ ఎన్నికల పోలింగ్ షురూ.. ఆ రెండు స్థానాలపై అందరి దృష్టి

ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిల్లో మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Lok Sabha Election 2024 Phase 5 : దేశం వ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్ పూర్తికాగా.. ఐదో విడత పోలింగ్ ఇవాళ జరుగుతుంది. పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిల్లో మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Also Read : UK PM Rishi Sunak : కింగ్ చార్లెస్ కన్నా సంపాదనలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ రికార్డు

పోలింగ్ జరిగే రాష్ట్రాలు..
ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏడు, బిహార్ లో ఐదు, ఒడిశా ఐదు, ఝార్ఖండ్ రాష్ట్రంలో మూడు, జమ్మూకశ్మీర్ లో ఒకటి, లద్దాఖ్ లో ఒక స్థానంకు పోలింగ్ జరుగుతుంది. ఇవాళ్టి పోలింగ్ పూర్తితో దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకుగాను 428 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయినట్లవుతుంది.

Also Read : రాజీనామాకు నేను రెడీ..! భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆ రెండు నియోజకవర్గాలపై అందరి దృష్టి..
సోమవారం దేశంలోని పలు రాష్ట్రాల్లో 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా.. అందరి దృష్టి రాయ్ బరేలీ, అమేదీలపై పడింది. ఈ రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అయితే, ఐదేళ్ల క్రితం అమేదీలో బీజేపీ అభ్యర్థిగా స్మృతి ఇరానీ పోటీచేసి రాహుల్ గాంధీపై విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అమేదీలో స్మృతి ఇరానీ మళ్లీ పోటీచేస్తుండగా.. ఆమెపై గాంధీ కుటుంబ సన్నిహితుడు కిశోరీలాల్ శర్మను కాంగ్రెస్ బరిలోకి దింపింది. గత కొద్ది ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి సోనియాగాంధీ విజయం సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభకు వెళ్లడంతో ఆ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు.

Also Read : హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు.. ఏపీ నుంచి 150 మందిని..

పోటీలో ఉన్న ప్రముఖులు వీరే..
ఐదో విడత ఎన్నికల్లో రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, ఉజ్వల్ నికమ్, కరణ్ భూషణ్ సింగ్, రామ్ విలాస్ పాశ్వాన్, ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత రోణి ఆచార్య వంటి ప్రముఖ నేతలు ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు