Punjab Police Dog Story : క్యాన్సర్ జయించి విధుల్లో చేరిన పంజాబ్ పోలీస్ డాగ్

సిమ్మీ పంజాబ్ పోలీస్ డాగ్ స్టోరీ అందరిలో స్ఫూర్తి నింపుతోంది. 14 సంవత్సరాల వయసు గల ఈ డాగ్ పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో పని చేస్తోంది. ఇటీవల క్యాన్సర్‌ను జయించి తిరిగి విధుల్లోకి చేరి అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Punjab Police Dog inspirational story : మనుష్యులలో లాగనే కుక్కలు కూడా క్యాన్సర్ బారిన పడుతూ ఉంటాయి. పర్యావరణలో మార్పులు లేదా.. జన్యుపరమైన అంశాల కారణంగా ఇవి క్యాన్సర్ బారిన పడుతుంటాయట. పంజాబ్ పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో ఉన్న సిమ్మీ అనే డాగ్ క్యాన్సర్‌ను జయించి విధుల్లో చేరింది. ఈ డాగ్ స్ఫూర్తివంతమైన కథ వైరల్ అవుతోంది.

Story of a dog : 64 కిలోమీటర్లు.. 27 రోజులు రోడ్డుపై ఆ డాగ్ నడుస్తూనే ఉంది.. చివరికి ఎక్కడికి చేరింది?

పంజాబ్ డాగ్ స్క్వాడ్‌లో ఉన్న సిమ్మీ అనే డాగ్ క్యాన్సర్ బారిన పడింది. అయితే క్యాన్సర్‌తో పోరాడి ఆరోగ్యంగా తిరిగి వచ్చి విధుల్లో చేరింది. గతంలో ఈ డాగ్ ఎన్నో ఆపరేషన్లలో పోలీసులకు అమూల్యమైన సహకారం అందించి వారి ప్రశంసలు పొందింది. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న సిమ్మీకి పోలీసు అధికారులు వైద్యులతో చికిత్స చేయించారు. ఎంతో ధైర్యంగా చికిత్స పొందిన సిమ్మీ దృఢసంకల్పం అందరిలో స్ఫూర్తి నింపుతోంది. క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న సిమ్మీ రీసెంట్‌గా విధుల్లో చేరింది. వాహనంలోంచి దిగుతూ పోలీసులకు ఆపరేషన్ లో సహకారం అందిస్తున్న సిమ్మీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Delhi Airport : 17 కోట్ల విలువైన కోకైన్ తరలింపుకు కిలాడీ లేడీ స్కెచ్ .. పసికట్టి పట్టించిన కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్

వీడియో చూసిన నెటిజన్లు సిమ్మీ ఆత్మస్థైర్యాన్ని అభినందిస్తున్నారు. ‘ఫైటర్’ అని.. ‘వెల్డన్ సిమ్మీ గాడ్ బ్లెస్ యూ’.. అని కామెంట్లు పెడుతున్నారు. చాలామంది లవ్ ఎమోజీలను పోస్ట్ చేశారు. నిజంగానే సిమ్మీ రియల్ ఫైటర్.

ట్రెండింగ్ వార్తలు