Motorola Razr 50 Series : మోటోరోలా నుంచి మడతబెట్టే రెజర్ 50 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే డిజైన్, స్పెషిఫికేషన్లు లీక్..

Motorola Razr 50 Series : రాబోయే ఫోల్డబుల్ ఫోన్‌లు ఇప్పుడు టిప్‌స్టర్ ద్వారా ప్రెస్ రెండర్‌ల రూపంలో ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ పెద్ద కవర్ స్క్రీన్‌ను సూచిస్తాయి. 3.3-అంగుళాల కర్వడ్ పోలెడ్ స్క్రీన్‌తో రానున్నాయి.

Motorola Razr, Razr 50 Ultra Design Renders Surface ( Image Credit : Google )

Motorola Razr 50 Series : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి సరికొత్త మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. కంపెనీ రాబోయే ఫోల్డబుల్ ఫోన్‌లు ఇప్పుడు టిప్‌స్టర్ ద్వారా ప్రెస్ రెండర్‌ల రూపంలో ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. లేటెస్ట్ ఫోన్లు ప్రామాణిక రెజర్ మోడల్ కవర్ స్క్రీన్‌తో వస్తుందని సూచిస్తున్నాయి. ముందున్న మోటరోలా రెజర్ 40లో ఔటర్ డిస్‌ప్లే కన్నా చాలా పెద్దదిగా ఉండనుంది. రెజర్ 50 స్పెసిఫికేషన్‌లు కూడా లాంచ్‌కు ముందు లీక్ అయ్యాయి.

Read Also : iPhone 16 Pro Display : ఆపిల్ ఐఫోన్ 15 ప్రోతో పోలిస్తే.. రాబోయే ఐఫోన్ 16 ప్రోలో 20శాతం బ్రైట్‌నెస్ డిస్‌ప్లే.. కొత్త క్యాప్చర్ బటన్..!

బ్లాస్ మోటోరోలా రెజర్, మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ ఫొటోలను షేర్ చేశారు. గత రెండర్‌ల ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ చాలా పెద్ద కవర్ స్క్రీన్‌ను సూచిస్తాయి. 3.3-అంగుళాల కర్వడ్ ఉన్న పోలెడ్ స్క్రీన్ అని సూచిస్తుంది. గత ఏడాదిలో 1.5-అంగుళాల ఔటర్ డిస్‌ప్లే ఉన్న రెజర్ 40 కన్నా పెద్దదిగా ఉండనుంది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ల ఫొటోలు లీక్ కావడానికి కొద్దిసేపటి ముందు ఈ స్పెసిఫికేషన్‌లను డీల్ ఎన్‌టెక్ పబ్లీష్ చేసింది.

మోటోరోలా రెజర్ 50 కూడా డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉండనుంది. లోపలి భాగంలో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హోల్ పంచ్ సెల్ఫీ కెమెరాతో పెద్ద 6.9-అంగుళాల పీఓఎల్ఈడీ స్క్రీన్‌ను చూడవచ్చు. రెజర్ 50 మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్‌తో పాటు 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో రానుందని నివేదిక తెలిపింది. కంపెనీ మోటోరోలా రెజర్ 50ని 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ సెకండరీ కెమెరాతో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. 4,200ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ 171x74x7.2ఎమ్ఎమ్ కొలతలు, 188 గ్రాముల బరువు ఉంటుందని నివేదిక పేర్కొంది.

మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ లీకైన ఫొటోలు :
మరోవైపు, మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ లీకైన ఫొటోలు ఫోల్డబుల్ ఫోన్‌ను ఔటర్ డిస్‌ప్లేను సూచిస్తున్నాయి. ప్రామాణిక రెజర్ 50 మోడల్‌లో ఉన్నదాని కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. అంతేకాదు.. ఈ ఫోన్ 3 కలర్ ఆప్షన్లలో కూడా వస్తుంది. మునుపటి నివేదిక ప్రకారం.. రెజర్ 50 అల్ట్రా ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల పీఓఎల్ఈడీ ఇంటర్నల్ స్క్రీన్‌తో కూడా అమర్చి ఉంటుంది. రెజర్ అల్ట్రా సక్సెసర్ 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌తో రన్ అవుతుంది. క్లామ్‌షెల్-శైలి ఫోల్డబుల్ 50ఎంపీ ప్రైమరీ కెమెరా, ఔటర్ స్క్రీన్‌పై 50ఎంపీ టెలిఫోటో కెమెరాను కలిగి ఉండనుంది.

అయితే, 32ఎంపీ సెల్ఫీ కెమెరా లోపలి స్క్రీన్‌పై హోల్ పంచ్ కటౌట్‌తో వస్తుంది. ప్రామాణిక రెజర్ 50 మోడల్ కాకుండా రాబోయే మోటోరోలా రెజర్ 50 అల్ట్రా కొద్దిగా చిన్న 4,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. నీటి నిరోధకతకు ఐపీఎక్స్8 రేటింగ్‌ను కలిగి ఉండనుంది. మోటోరోలా జూన్ 2023లో గ్లోబల్ మార్కెట్‌లలో రెజర్ 40 సిరీస్‌ను ప్రారంభించింది. ఈ హ్యాండ్‌సెట్‌లు ఒక నెల తర్వాత భారత మార్కెట్లోకి వచ్చాయి. ఈ ఫోన్‌ల గురించి రాబోయే రోజుల్లో లేదా వారాల్లో పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.

Read Also : iPhone 17 Series : స్లిమ్ రిఫ్రెష్డ్ డిజైన్‌తో అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 సిరీస్ మోడల్‌ వస్తోంది..!

ట్రెండింగ్ వార్తలు