Top 5 Mobile Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. 6000mAh భారీ బ్యాటరీతో టాప్ 5 స్మార్ట్ఫోన్లు.. ఏది కొంటారో మీఇష్టం
Top 5 Mobile Phones : భారీ బ్యాటరీతో కొత్త ఫోన్ కావాలా? ఛార్జింగ్ సమస్య లేకుండా ఉండాలంటే మార్కెట్లో లభ్యమయ్యే ఈ టాప్ 5 ఫోన్లలో ఏదైనా ఒకటి కొనేసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Top 5 Mobile Phones
- 6000mAh భారీ బ్యాటరీతో టాప్ 5 మొబైల్ ఫోన్లు
- 50MP మెయిన్ కెమెరా, 5జీ సపోర్టుతో కిర్రాక్ ఫీచర్లు
- శాంసంగ్ నుంచి వివో Y19s 5జీ వరకు ఏది బెటర్?
Top 5 Mobile Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మంచి బ్యాటరీ లైఫ్ అందించే ఫోన్ కావాలంటే ఇది మీకోసమే.. పవర్ బ్యాంక్, ఛార్జర్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. 6000mAh బ్యాటరీతో అద్భుతమైన స్మార్ట్ఫోన్లు భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఇకపై ఫోన్ ఛార్జింగ్ సమస్య ఉండదు. ఈ టాప్ 5 ఫోన్లలో మోటోరోలా G86 పవర్ 5జీ, రియల్‌మి నార్జో 50A, రియల్‌మి C73 5జీ, వివో Y19s 5జీ ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
శాంసంగ్ గెలాక్సీ F15 5G :
బ్రాండ్ వాల్యూ, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే యూజర్లకు ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆప్షన్. భారీ 6000mAh బ్యాటరీతో వస్తుంది. మామూలుగా వాడినా 2 రోజులు ఛార్జింగ్ వస్తుంది. అద్భుతమైన sAMOLED డిస్ప్లే, వీడియో, గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 5G సపోర్టుతో వస్తుంది. అద్భుతమైన డిస్ప్లే క్వాలిటీతో వస్తుంది.
మోటోరోలా G86 పవర్ 5జీ :
ఈ కొత్త మోటోరోలా స్మార్ట్‌ఫోన్ పవర్ఫుల్ బ్యాటరీతో పాటు ‘క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్’ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. సాఫ్ట్వేర్-బ్యాటరీ బ్యాలెన్స్‌ను అందిస్తుంది. భారీ యాప్‌లు, మల్టీ టాస్కింగ్ కోసం పవర్ఫుల్ ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. 120Hz రిఫ్రెష్ రేట్, హై-కెపాసిటీ బ్యాటరీ రోజంతా వస్తుంది.
రియల్‌మి నార్జో 50A, రియల్‌మి C73 5జీ :
ఈ రెండు రియల్‌మి మోడల్స్ బ్యాటరీ లైఫ్ పరంగా చాలా బెస్ట్. రియల్‌మి నార్జో 50A లాంగ్ బ్యాటరీ లైఫ్, మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్‌తో వస్తుంది. రియల్‌మి C73 5జీ అనేది 6000mAh బ్యాటరీ, మృదువైన 120Hz డిస్ప్లేతో అత్యంత సరసమైన 5G ఫోన్ అని చెప్పొచ్చు.
రోజంతా యూట్యూబ్ వీడియోలు చూడటం, ఆన్లైన్ గేమ్‌లు ఆడటం, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువతకు ఈ ఫోన్లు బెస్ట్. ఈ హ్యాండ్సెట్లు ఒకసారి ఛార్జ్ చేస్తే మళ్లీ ఛార్జర్ అవసరం ఉండదు. రోజంతా ఛార్జింగ్ వస్తుంది.
వివో Y19s 5జీ :
వివో Y19s 5జీ ఫోన్ బ్యాటరీ చాలా స్లిమ్‌గా స్టైలిష్‌గా ఉంటుంది. చేతిలో బరువుగా అనిపించదు. ప్రీమియం లుక్ 6000mAh బ్యాటరీతో పాటు కాలింగ్, బ్రౌజింగ్, ఆన్లైన్ మీటింగ్స్ వంటి రోజువారీ టాస్కులకు బెస్ట్ ఆప్షన్. క్లీన్ ప్రాసెసర్ ఉంది. పవర్ బ్యాటరీతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
