ఈసారి మోసపోతే తప్పు మనదే, ఆలోచించి ఓటు వేయండి- కేటీఆర్

అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీపై చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు.

Ktr : ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పదేళ్ల పాలనలో ప్రధాని మోదీ సామాన్యులకు చేసిందేమి లేదని కేటీఆర్ విమర్శించారు. గుడి పేరుతో తప్ప అభివృద్ధి చూపి ఓట్లడగటం లేదని బీజేపీపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవన్నారు కేటీఆర్. అత్యధిక వరి సాగులో నల్గొండ జిల్లా టాప్ లో ఉందన్నారు. ఒక గుడి కట్టి దేశం మొత్తం బీజేపీ ప్రచారం చేస్తే.. మూడు మెడికల్ కాలేజీలు ఉమ్మడి నల్గొండకు ఇచ్చి ప్రచారం చేసుకోలేకపోయామని కేటీఆర్ వాపోయారు.

పదేళ్లలో 2లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని చెప్పారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీపై చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. నాట్లు వేసేటప్పుడు రైతు భరోసా ఇవ్వలేదు, ఓట్లు వేసేటప్పుడు మాత్రం కొందరికి వేశారని అన్నారు. ధిక్కార స్వరం మండలికి కావాలి, అందుకే రాకేశ్ ను గెలిపించండి అని కేటీఆర్ కోరారు. రేవంత్ రెడ్డి మందికి పుట్టిన పిల్లలను కూడా తన పిల్లలు అంటున్నారు, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు తాను నియామక పత్రాలు ఇస్తూ అబద్దాలు ఆడుతున్నారు అని మండిపడ్డారు.

ఎన్నికల్లో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే సమయం పట్టభద్రులకు వచ్చిందన్నారు కేటీఆర్. ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరిలో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డితో కలిసి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, బుద్ధి చెప్పాలన్నా ఇదే సమయం అంటూ కేటీఆర్ చెప్పారు. పట్టభద్రుల కోసం నిజంగా ప్రశ్నించే గొంతు రాకేశ్ రెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సైనికులంతా పని చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Also Read : అదుపులేని ఎన్నికల వ్యయం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ.701 కోట్ల ఖర్చు..!

ట్రెండింగ్ వార్తలు