2024 Elections: దూకుడు పెంచిన కాంగ్రెస్.. అప్పుడే సీట్ల పంపకానికి పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ

పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకే ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టేందుకు అంగీకరించాయి. ఇంత క్లారిటీ వచ్చాకి సీట్ల పంపకాలు కూడా జరిగిపోతే వచ్చే ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని హస్తం పార్టీ ఆలోచిస్తుందట. అందుకే రాహుల్ వెంటనే సీట్ల పంపకాలకు ప్రకటన చేశారు.

Opposition Meet: శుక్రవారం బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన విపక్షాల మీటింగుతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపి వచ్చినట్టే కనిపిస్తోంది. సమావేశం ముగిసి 24 గంటలు కాకముందే వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సీట్ల పంపకాలకు సిద్ధమంటూ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విపక్షాల మెగా సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని అన్ని పార్టీలు ప్రకటించాయి. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకే ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టేందుకు అంగీకరించాయి. ఇంత క్లారిటీ వచ్చాకి సీట్ల పంపకాలు కూడా జరిగిపోతే వచ్చే ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని హస్తం పార్టీ ఆలోచిస్తుందట. అందుకే రాహుల్ వెంటనే సీట్ల పంపకాలకు ప్రకటన చేశారు.

Opposition Meet: తిరిగి తిరిగి కాంగ్రెస్ చెంతకే ప్రతిపక్షాలు.. పాట్నా మెగా మీటింగ్‭లో ఏం జరిగింది?

స్థానిక పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలు నిర్ణయించినట్లే సీట్ల పంపకాలకు కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 10 లేదంటే 12న మరోమారు విపక్షాల సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆలోపు సీట్ల పంపకంలో ఒక క్లారిటీకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే రాహుల్ ప్రకటనపై విపక్ష పార్టీలు ఎలాంటి ప్రకటన చేయలేదు. వారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Opposition Meet: అంత చర్చా చేసి రాహుల్ గాంధీని పెళ్లికి ఒప్పించారట.. విపక్షాల మీటింగ్‭పై బీజేపీ షార్ప్ అటాక్

శుక్రవారం జరిగిన విపక్షాల మెగా సమావేశానికి 15 పార్టీల నుంచి 32 మంది నేతలు వచ్చారు. ఇక బీజేపీని ఓడించడమేనని శపథం చేశారు.
విపక్షాల మెగా సమావేశంలో పాల్గొన్న నేతలు వీరే..
1. నితీష్ కుమార్ (JDU)
2. మమతా బెనర్జీ (AITC)
3. MK స్టాలిన్ (DMK)
4. మల్లికార్జున్ ఖర్గే (INC)
5. రాహుల్ గాంధీ (INC)
6. అరవింద్ కేజ్రీవాల్ (AAP)
7. హేమంత్ సోరెన్ (JMM)
8. ఉద్ధవ్ థాకరే (SS-UBT)
9. శరద్ పవార్ (NCP)
10. లాలూ ప్రసాద్ యాదవ్ (RJD)
11. భగవంత్ మాన్ (AAP)
12. అఖిలేష్ యాదవ్ (SP)
13. KC వేణుగోపాల్ (INC)
14. సుప్రియా సూలే (NCP)
15. మనోజ్ ఝా (RJD)
16. ఫిర్హాద్ హకీమ్ (AITC)
17. ప్రఫుల్ పటేల్ (NCP)
18. రాఘవ్ చద్దా (AAP)
19. సంజయ్ సింగ్ (AAP)
20. సంజయ్ రౌత్ (SS-UBT)
21. లాలన్ సింగ్ (JDU)
22. సంజయ్ ఝా (RJD)
23. సీతారాం ఏచూరి (CPIM)
24. ఒమర్ అబ్దుల్లా (NC)
25. టీఆర్ బాలు (DMK)
26. మెహబూబా ముఫ్తీ (PDP)
27. దీపాంకర్ భట్టాచార్య (CPIML)
28. తేజస్వి యాదవ్ (RJD)
24 అభిషేక్ బెనర్జీ (AITC)
25. డెరెక్ ఓ’బ్రియన్ (AITC)
26. ఆదిత్య థాకరే (SS-UBT)
27. డి రాజా (CPI)

ట్రెండింగ్ వార్తలు