Karnataka Heavy Rains : కర్ణాటకలో భారీవర్షాలు..8మంది మృతి

కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 8 మంది మృతి చెందారు. కోస్తా పరిధిలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో కురిసిన భారీవర్షాల వల్ల 8 మంది మరణించారని అధికారులు చెప్పారు....

Karnataka Heavy Rains

Karnataka Heavy Rains : కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 8 మంది మృతి చెందారు. కోస్తా పరిధిలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో కురిసిన భారీవర్షాల వల్ల 8 మంది మరణించారని అధికారులు చెప్పారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాల్ తాలూకా నందవర గ్రామంలో కొండ గుహపై ఉన్న ఇల్లు కూలి 47 ఏళ్ల మహిళ మరణించారు. (Rain-Related Deaths Rise To 8) ఈ ఘటనలో శిథిలాల నుంచి 20 ఏళ్ల యువతిని సహాయ సిబ్బంది రక్షించారు. (Karnataka’s Twin Coastal Districts)

Tamim Iqbal : గురువారం రిటైర్మెంట్.. శుక్ర‌వారం ప్ర‌ధానితో భేటీ.. నిర్ణ‌యం వెన‌క్కి తీసుకున్న స్టార్ క్రికెట‌ర్‌

బెల్మాన్ పట్టణంలో కర్కాలా-పాడుబిద్రి రోడ్డుపై బైక్ పై వెళుతుండగా చెట్టు కూలి బైకర్ మరణించారు. పిలార్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ ఆచార్య అనే యువకుడు భారీవర్షాల వల్ల మృత్యువాత పడ్డారు. దక్షిన కన్నడ జిల్లాలో ఐదుగురు, ఉడుపి జిల్లాలో ముగ్గురు మరణించారని రెవెన్యూ అధికారులు చెప్పారు. ఉడుపిలోని కల్లియాన్ పుర-సంతెకట్టి జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న అండర్ పాస్ భారీవర్షం వల్ల కూలింది. భారీవర్షాలు, వరదల వల్ల కర్ణాటకలోని రెండు కోస్తా జిల్లాల్లో జనజీవనం స్తంభించి పోయింది.

ట్రెండింగ్ వార్తలు