సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు?: చిరంజీవి, పవన్ కల్యాణ్ పై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే సరైన దారిలో ఉండేవారని, ఇప్పుడు పక్కదారి పట్టారని జగ్గారెడ్డి అన్నారు.

Jagga Reddy (Photo Credit : Google)

Jagga Reddy : టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. రైతులకు నష్టం జరుగుతోందని సినిమా తీసిన మెగాస్టార్ చిరంజీవి.. ఢిల్లీలో ధర్నా చేసిన వారికి ఎందుకు మద్దతివ్వలేదు అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్, బీజేపీలకు చిరంజీవి ఎందుకు మద్దతిస్తున్నారు? అని నిలదీశారు.

సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న మీరు.. రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదని చిరు, పవన్ లను అడిగారు. రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి, మోదీకి మద్దతిస్తున్నారని విమర్శించారు జగ్గారెడ్డి. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే సరైన దారిలో ఉండేవారని, ఇప్పుడు పక్కదారి పట్టారని జగ్గారెడ్డి అన్నారు.

”రుణమాఫీ పైసలతో ఫోన్లన్నీ టింగు టింగు మంటున్నాయి. ఆగస్టు 15లోపు 2లక్షల మాఫీ అయిపోతుంది. దీనికి సాక్ష్యం రైతులే. ఫోన్ లలో మెసేజ్ లు చూసి రైతుల ఇళ్ళలో సంబరాలు జరుగుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు రాత్రి నిద్రలేదు. కేసీఆర్ పదేళ్ళలో 7 లక్షల కోట్ల ఆప్పులు చేసి రైతు లకు ఇచ్చింది 26 వేల కోట్లే. కాంగ్రెస్ 6 నెలల్లో రైతులకు ఇచ్చింది 31 వేల కోట్లు. ఇంకా నాలుగున్నర సంవత్సరాల టైం ఉన్నా 6 నెలల్లోనే ఇచ్చిన హామీ నెరవేర్చాం. బీజేపీ ఎన్ని వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది. బండి సంజయ్ సమాధానం చెప్పాలి.

Also Read : కేసీఆర్‌ అసెంబ్లీకి వెళ్తారా, లేదా? బీఆర్ఎస్‌కు జూలై 24 టెన్షన్..! కాంగ్రెస్ వ్యూహం ఏంటి..

నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్లకు 16 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసింది. ఇందులో ఒక్క రైతు అయినా ఉన్నారా? గతంలో దేశం మొత్తం 71 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దే. బీఆర్ఎస్ చరిత్ర అంతా అప్పులే. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ ఖూనీ చేసింది. నల్ల చట్టాలతో దేశ రైతులను మర్డర్ చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులను చంపేశారు. కేంద్ర మంత్రుల కొడుకులు రైతుల మీద నుంచి బండ్లు ఎక్కించారు” అని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

ట్రెండింగ్ వార్తలు