Formula E Car Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సంచలనం.. క్విడ్ ప్రో కో జరిగిందని రిపోర్ట్.. కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ వద్దకు..
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసుని విచారించిన ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

Formula E Car Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందింది. తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఏసీబీ. 9 నెలల పాలు కేసును విచారించిన ఏసీబీ అధికారులు ఫైనల్ రిపోర్ట్ ను తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ను కూడా విచారించింది ఏసీబీ.
కేటీఆర్ ను నాలుగుసార్లు, అరవింద్ ను ఐదుసార్లు విచారించారు. కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావును కూడా ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి రిపోర్ట్ పంపింది ఏసీబీ. గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది ఏసీబీ.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసుని విచారించిన ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఏసీబీ నివేదికలో కీలక అంశాలు పొందుపరిచినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఏసీబీ నిర్ధారించింది. స్పాన్సర్ కంపెనీ నుండి అప్పటి అధికార పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ చెల్లించినట్టు ఏసీబీ గుర్తించింది. ఈ కార్ రేసింగ్ కు స్పాన్సర్ షిప్ చేసిన సంస్థ 44 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ను బీఆర్ఎస్ పార్టీకి చెల్లించినట్టు నివేదికలో తెలిపింది. ఈ విధంగా క్విడ్ ప్రో కో జరిగినట్టు నిర్ధారించింది ACB.
Also Read: తెలంగాణ గ్రూప్-1 పిటీషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. రిజల్ట్స్ రద్దు..!