Pawan Kalyan: పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలి- వైసీపీ కీలక నేతల ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళితే పవన్ సీఎం అయితే బెటర్ అని వారు ఇద్దరూ అభిప్రాయపడ్డారు.
Pawan Kalyan Representative Image (Image Credit To Original Source)
- చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళితే పవన్ సీఎం అయితే బెటర్
- పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలని కాపు సామాజికవర్గం ఆలోచిస్తోంది
- పవన్ ముఖ్యమంత్రి ఒక పెద్ద కులానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జన సైనికులు, ఆయన అభిమానులు కోరుకోవడం కామన్. ఇందులో పెద్ద వింతేమీ లేదు. తాము ఎంతగానో అభిమానించే తమ నాయకుడిని సీఎం కుర్చీలో చూడాలని వారు ఆరాటపడటంలో అర్థం ఉంది. అయితే, ఇందుకు భిన్నమైన సీన్ కనిపించింది. పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలని ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు కోరుకోవడం ఆసక్తికరంగా మారింది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు ఈ తరహా కామెంట్స్ చేయడం విశేషం.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాగా, పవన్ కల్యాణ్ సీఎం అవ్వడం అనే అంశంపై వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకేసారి స్పందించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళితే పవన్ సీఎం అయితే బెటర్ అని బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలని కాపు సామాజికవర్గం ఆలోచిస్తోందని తోట త్రిమూర్తులు అన్నారు.
పవన్ సీఎం అయితే ఒక పెద్ద కులానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందన్నారు బొత్స సత్యనారాయణ. చిట్ చాట్ సందర్భంగా ఈ ఇద్దరు వైసీపీ కీలక నేతలు ఈ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం అని వైసీపీ నేతలు బొత్స, తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
Also Read: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? సర్కార్ ఆలోచన ఏంటి?
