PM-Kisan : పీఎం కిసాన్‌పై ఉత్కంఠ.. రూ. 22వ విడతకు ముందే లక్షలాది రైతుల పేర్లు తొలగింపు.. మీ పేరు తీసేయడానికి 5 కారణాలివే..!
PM-Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులు లక్షలాది మంది 22వాయిదాను అందుకోలేరు. ఇందుకు 5 కారణాలను తప్పక తెలుసుకోండి. మీర పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి.
PM-Kisan 22nd installment
- పీఎం కిసాన్ 22వ వాయిదాపై కీలక అప్డేట్
- రూ. 22వ వాయిదా రాక ముందే జాబితాలో రైతుల పేర్లు తొలగింపు
- మార్చి-ఏప్రిల్ మధ్య బ్యాంకు ఖాతాలో రూ. 2వేలు పడే అవకాశం
- లబ్ధిదారుల లిస్టు నుంచి మీ పేరు తొలగింపునకు 5 కారణాలివే
PM-Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 22వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఈ విడత కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం.. మార్చి-ఏప్రిల్ మధ్య బ్యాంకు ఖాతాలో రూ. 2వేలు పడతాయని భావిస్తున్నారు.
పీఎం-కిసాన్ 22వ విడత రూ. 2వేలు పంపిణీపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ, పీఎం-కిసాన్ లబ్ధిదారుల జాబితా నుంచి లక్షలాది మంది రైతుల పేర్లు తొలగించినట్టు అనేక మీడియా నివేదికలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారు జాబితాలో మీ పేరు కూడా తొలగించారో లేదో ఇప్పుడే వివరంగా తెలుసుకుందాం..
పీఎం కిసాన్ లబ్ధిదారుల లిస్టు నుంచి పేరు తొలగింపు :
పీఎం కిసాన్ లబ్ధిదారుల లిస్టు నుంచి మీ పేరు తొలగించడానికి 5 కారణాలు ఉన్నాయి. అవేంటంటే?
1. e-KYC పూర్తి చేయకపోతే మీ లబ్ధిదారు అకౌంట్ తొలగించవచ్చు
2. భూమి రికార్డులు లింక్ చేయకపోవడం లేదా యాజమాన్యం డేటాతో మ్యాచ్ కాకపోవడం
3. మీ ఆధార్ మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయకపోతే
4. మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే మీరు తప్పుగా క్లెయిమ్ చేస్తే
5. ప్రభుత్వం ఒకే కుటుంబంలో ఎక్కువ ఫేక్ ఎంట్రీలను గుర్తించినట్టుయితే..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన బెనిఫిట్స్ పొందడానికి రైతులు ఈ 5 ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి.
1. మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయండి
2. మీ ఆధార్ సీడింగ్‌ను బ్యాంక్ అకౌంట్ స్టేటస్ చెక్ చేయండి
3. మీ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంటులో మీ DBT ఆప్షన్ యాక్టివ్‌గా ఉంచండి
4. మీ e-KYCని పూర్తి చేయండి
5. పీఎం కిసాన్ పోర్టల్‌లోని ‘Know Your Status’ మాడ్యూల్ కింద మీ ఆధార్ సీడింగ్ స్టేటస్ చెక్ చేయండి.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి? :
- అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ (https://pmkisan.gov.in) పోర్టల్‌ను విజిట్ చేయండి.
- పేమెంట్ సక్సెస్ తర్వాత ట్యాబ్ కింద మీరు భారత మ్యాప్ చూస్తారు.
- రైట్ సైడ్ ‘Dashboard’ అనే ఎల్లో కలర్ ట్యాబ్ ఉంటుంది.
- డాష్‌బోర్డ్‌పై క్లిక్ చేయండి.
- క్లిక్ చేశాక మీరు కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
- విలేజ్ డాష్‌బోర్డ్ ట్యాబ్‌లో మీ పూర్తి వివరాలను ఇవ్వాలి.
- రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, పంచాయతీని ఎంచుకోండి
- ఆ తర్వాత S బటన్ పై క్లిక్ చేయండి.
- ఃమీ పూర్తి వివరాలను ఎంచుకోవచ్చు
‘Get Report’ బటన్ క్లిక్ చేయండి - – మీరు మీ పేరును లబ్ధిదారుల జాబితాలో చూడవచ్చు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 నవంబర్‌లో తమిళనాడులోని కోయంబత్తూరులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 21వ విడతను విడుదల చేశారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా దాదాపు రూ.20,500 కోట్ల ప్రత్యక్ష ఆర్థిక సాయం పొందారు.
పీఎం కిసాన్ పథకం :
పీఎం కిసాన్ పథకం అనేది సాగుభూమి పండించే రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు పీఎం కిసాన్ ప్రధానమంత్రి ఫిబ్రవరి 2019లో ప్రారంభమైంది. ఈ పథకం కింద ఏడాదికి రూ. 6వేలు ఆర్థిక సాయాన్ని పొందవచ్చు. మొత్తం 3 సమాన వాయిదాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) మోడ్ ద్వారా రైతుల ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలకు బదిలీ అవుతుంది.
