RRR: ఆర్ఆర్ఆర్ 12 రోజుల వసూళ్లు.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా.....

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా బాక్సాఫీస్ భరతం పట్టేలా దూసుకుపోతోంది.

RRR: ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల వరద.. టీమ్‌కు దిల్ రాజు సక్సెస్ పార్టీ

సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్నా కలెక్షన్ల వరద మాత్రం ఆగడం లేదు. బాక్సాఫీస్ వద్ద మరే ఇతర పెద్ద సినిమా లేకపోవడం.. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ఆర్ఆర్ఆర్ చిత్రానికి జనం బ్రహ్మరథం పడుతుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే పలు కొత్త రికార్డులను తన పేరిట రాసుకుంటూ వెళ్తోంది ఈ మూవీ. కాగా ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించిందంటే, ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ సెలబ్రేషన్స్

ఇక ఈ సినిమా 12 రోజుల థియేట్రికల్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.521.06 కోట్ల షేర్ వసూళ్లు సాధించగా.. రూ.938.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మ్యాజిక్ ఫిగర్ అయిన రూ.వెయ్యి కోట్ల మార్క్‌ను ఆర్ఆర్ఆర్ ఎప్పుడు టచ్ చేస్తుందా అని సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా ఆర్ఆర్ఆర్ 12 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి…

నైజాం – రూ.101.36 కోట్లు
సీడెడ్ – రూ.46.55 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.31.61 కోట్లు
ఈస్ట్ – రూ.14.36 కోట్లు
వెస్ట్ – రూ.12.00 కోట్లు
గుంటూరు – రూ.16.77 కోట్లు
కృష్ణా – రూ.13.40 కోట్లు
నెల్లూరు – రూ.8.31 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.244.36 కోట్లు(షేర్) (రూ.367 కోట్లు గ్రాస్)
కర్ణాటక – రూ.38.70 కోట్లు
తమిళనాడు – రూ.34.90 కోట్లు
కేరళ – రూ.9.75 కోట్లు
హిందీ – రూ.97.10 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – రూ.7.55 కోట్లు
ఓవర్సీస్ – రూ.88.70 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.521.06 (షేర్) (రూ.938.50 కోట్లు గ్రాస్)

ట్రెండింగ్ వార్తలు