అంతరిక్ష శిథిలాల వల్ల తమ ఇల్లు దెబ్బతిందని కేసు వేసిన కుటుంబం

Space Junk Destroys Home: అందులోని ఓ భాగమే మెటాలిక్ సిలిండర్. దాని వల్ల తన కుమారుడు గాయపడ్డాడని కూడా అలెజాండ్రో ఒటెరో చెప్పారు.

అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ నాసా వల్ల తమకు ఆస్తి నష్టం జరిగిందని, మానసిక వేదనకు గురయ్యామని ఆ దేశంలోని ఓ కుటుంబం కేసు వేసింది. అంతరిక్ష శిథిలాల వల్ల తమ ఇల్లు దెబ్బతిందని చెప్పింది. నాసా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

ఈ ఏడాది మార్చిలో నేపుల్స్‌లోని తమ ఇంటిపై పడిన మెటాలిక్ సిలిండర్ స్లాబ్ వల్ల రంధ్రం పడిందని అలెజాండ్రో ఒటెరో అనే వ్యక్తి తెలిపాడు. 2021 మార్చిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి 2.9 టన్నుల బ్యాటరీల ప్యాలెట్‌ను తొలగించారు.

అందులోని ఓ భాగమే మెటాలిక్ సిలిండర్. దాని వల్ల తన కుమారుడు గాయపడ్డాడని కూడా అలెజాండ్రో ఒటెరో చెప్పాడు. అతడు న్యాయ సంస్థ క్రాన్‌ఫిల్ సమ్మర్ ద్వారా ఈ దావా వేశాడు. ఆ సంస్థ తాజాగా చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఈ వివరాలు తెలిపింది. ఒటెరో, అతని కుటుంబం తరపున నాసాపై దావా వేశామని చెప్పింది.

బీమా లేని ఆస్తికి నష్టం జరిగిందని పిటిషన్ లో పేర్కొన్నామని తెలిపింది. తమ క్లయింటుకు కలిగిన ఆస్తి నష్టంతో పాటు అతడు అనుభవించిన మానసిక వేదన సహా ఇతర నష్టాలను పిటిషన్ లో లిస్ట్ చేసినట్లు చెప్పింది. అంతరిక్ష శిథిలాలు ఇళ్లపై పడుతుండడం ఓ పెద్ద సమస్యగా మారిందని నిపుణులు అంటున్నారు.

Also Read: న్యూలుక్‌లో రాహుల్‌ గాంధీ.. సంప్రదాయ రాజకీయ నేత ఆహర్యంతో..

ట్రెండింగ్ వార్తలు