న్యూలుక్‌లో రాహుల్ గాంధీ.. సంప్రదాయ రాజకీయ నేత ఆహర్యంతో..
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైనప్పటి నుంచి రాహుల్ గాంధీలో మార్పు కొట్టొచ్చినట్టుగా కకబడుతోంది.

Rahul Gandhi new look in Lok Sabha
Rahul Gandhi new look in Lok Sabha: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ న్యూలుక్‌లో కనిపిస్తున్నారు. నిన్నటి వరకు టీషర్ట్, మోడరన్ ఫ్యాంట్‌తో కనిపించిన కాంగ్రెస్ అగ్రనేత.. ఇప్పుడు కుర్తా పైజామాలోకి మారిపోయారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. కాంగ్రెస్ ఎంపీలతో పాటు, మిగతా పార్టీల నాయకులు రాహుల్ ఆయన న్యూలుక్‌ను ఆసక్తిగా గమనించారు. మొన్నటి వరకు గుబురు గడ్డంతో కనిపించిన ఆయన ట్రిమ్ చేయించి కొత్తగా కనిపిస్తున్నారు. ఎంపీగా ప్రమాణస్వీకారానికి కూడా టీషర్ట్ ధరించి వచ్చిన రాహుల్.. ఈరోజు ట్రెడిషనల్ పొలిటిషియన్ గెటప్‌లో ఆకట్టుకున్నారు.
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైనప్పటి నుంచి రాహుల్ గాంధీలో మార్పు కొట్టొచ్చినట్టుగా కకబడుతోంది. ఆయన ముఖంలో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. మునుపటి కంటే ముందుగా ఆత్మవిశ్వాసంతో కనబడుతున్నారు. తమ నాయకుడిలో వచ్చిన మార్పులను కాంగ్రెస్ నాయకులు నిశితంగా గమనిస్తున్నారు. భారత్ జోడో యాత్ర నుంచి టీషర్ట్, మోడరన్ ఫ్యాంట్‌తో కనిపించిన ఆయన తాజాగా సంప్రదాయ రాజకీయ నేత ఆహర్యంలో కనిపించడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా బలమైన గళం వినిపించాలని, దూకుడుగా వ్యవహరించాలని కోరుకుంటున్నాయి.
Also Read : లోక్‌సభలో జై పాలస్తీనా నినాదం.. కలకలం రేపిన అసదుద్దీన్ ఒవైసీ
ఓం బిర్లాకు అభినందనలు
కాగా, లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ప్రతిపక్ష నేత హోదాలో, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఓం బిర్లాను సభాపతి స్థానం వరకు తోడ్కోని వెళ్లారు. స్పీకర్ స్థానంలో ఆశీనులైన ఓం బిర్లాతో కరచాలనం చేసి స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ”ఈ సభ భారతదేశ జనవాణిని వినిపించాలి. సభ సజావుగా నడపడంలో విపక్షం మీకు సహకరిస్తుంది. ప్రజావాణిని బలంగా వినిపించేందుకు ప్రతిపక్షాలకు అవకాశమిస్తారని ఆశిస్తున్నా. విపక్షాల గొంతు నొక్కడం ద్వారా సభ నడిపించడం అప్రజాస్వామికమవుతుంది. రాజ్యాంగాన్ని బలపరిచేలా మీ పనితీరు ఉంటుందని ఆశిస్తున్నాన”ని అన్నారు.
विपक्ष के नेता चुने जाने के बाद आज श्री @RahulGandhi संसद पहुंचे.
कांग्रेस अध्यक्ष श्री @kharge और विपक्ष के सांसदों ने उनका अभिवादन किया. pic.twitter.com/yZItV6KNC4
— Congress (@INCIndia) June 26, 2024