Petrol Prices Rise : పెట్రోల్ రేట్స్ బ్లాస్ట్.. ఒకేసారి లీటర్ పై 15 రూపాయలు పెంపు.. ఎక్కడంటే..
Petrol Prices Rise : ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా.. భారత దేశంలో ఆయిల్ రేట్లు స్థిరంగా ఉన్నా.. భారతదేశం పక్కనే ఉన్న దేశాలు మాత్రం ఆయిల్ రేట్లను భారీగా పెంచేశాయి.
Petrol Prices Rise
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉధ్రిక్తతలు
- ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం
- భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Prices Rise : ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మధ్య వార్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం కురిపిస్తుండగా.. ఇరాన్ సైతం ప్రతీకార దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. పశ్చిమాసియాలో ఈ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతానికి భారత దేశంలో ఆయిల్ రేట్లు స్థిరంగా ఉన్నా.. భారతదేశం పక్కనే ఉన్న దేశాలు మాత్రం ఆయిల్ రేట్లను పెంచేశాయి.
Also Read : Tamil Nadu Politics : తమిళనాడులో ఎన్డీయే కూటమిలోకి టీవీకే..? క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్..
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు చమురు నిల్వలపై దాడులకు పాల్పడుతున్నాయి. అంతేకాదు.. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడింది. ఈ పరిణామాలు గ్లోబల్ ఎకానమీని కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో పలు దేశాలు పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను భారీగా పెంచేస్తున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఎల్పీజీ గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా.. నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ (NOC) ఫెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచేసింది.
నేపాల్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ. 15 పెంచింది. డీజిల్, కిరోసిన్ పై రూ. 10 పెంచింది. సవరించిన ధరలు శనివారం రాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎన్ఓసీ తెలిపింది. సవరించిన ధరల ప్రకారం.. ఖాట్మండు, పోఖారా, దీపాయల్ తోపాటు పలు నగరాల్లో పెట్రోల్ లీటర్ ధర రూ.172కు చేరింది. డీజిల్, మోటార్ ఆయిల్ లీటర్ కు రూ. 152కు చేరింది.
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల మధ్య నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోలియం ఉత్పత్తుల ధరలను అంచనా వేసిన స్థాయికిమించి పెంచవలసి వచ్చింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి కొనసాగితే భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
