Comedian AVS Daughter Prashanthi and son in law Srinivas busy with their Acting Careers
Comedian AVS : దివంగత నటుడు AVS అందరికి పరిచయమే. AVS పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. కమెడియన్ గా ఎన్నో సినిమాలతో స్టార్ గా ఎదిగారు AVS. కమెడియన్ గానే కాక రైటర్ గా, నిర్మాతగా, దర్శకుడిగా, పాటల రచయితగా కూడా అనేక సినిమాలు చేశారు. 2013లో AVS మరణించారు. అయితే ఈయన కూతురు, అల్లుడు కూడా నటీనటులే అని తక్కువ మందికి తెలుసు.
AVS కూతురు శ్రీ ప్రశాంతి ప్రస్తుతం సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. అలాగే పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. శ్రీ ప్రశాంతి యూట్యూబ్, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా వీడియోస్, రీల్స్ పెడుతుంది. AVS కూతురు ప్రశాంతి నటుడు శ్రీనివాస్ ని పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్ అలియాస్ యాక్టర్ చింటు తెలుగు, తమిళ్ భాషల్లో అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేశారు. ప్రస్తుతం కూడా చేతి నిండా సినిమాలతో బిజీగానే ఉన్నారు.
ప్రశాంతి – శ్రీనివాస్ ఇద్దరూ నటీనటులుగా సినిమాలు, సీరియల్స్ తో బిజీగానే ఉన్నారు. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. ఈ ఇద్దరూ కూడా AVS గారిని పలు వేదికలపై తలచుకుంటారు. సోషల్ మీడియాలో కూడా పలుమార్లు AVS గారిని గుర్తుచేసుకుంటూ పోస్టులు చేస్తారు. AVS గారి అడుగుజాడల్లో నటీనటులుగా ఆయన కూతురు, అల్లుడు కెరీర్లో ముందుకు వెళ్లడం ఆనందకర విషయమే. తాజాగా ప్రశాంతి ఓ టీవీ ప్రోగ్రాంలో తన నాన్నని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది.