Sonia Gandhi: ఈడీ విచారణకు దూరంగా సోనియా గాంధీ

కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యల దృష్ట్యా ఇప్పట్లో విచారణకు హాజరుకాలేనంటూ సోనియా గాంధీ, ఈడీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో గురువారం జరగనున్న విచారణకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఈ కేసుకు సంబంధించి రేపు సోనియా ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉంది. అయితే, కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యల దృష్ట్యా ఇప్పట్లో విచారణకు హాజరుకాలేనంటూ సోనియా గాంధీ, ఈడీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా సోనియా గాంధీ ఇటీవల తొమ్మిది రోజులపాటు ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.

MVA crisis: ముగిసిన మహా క్యాబినెట్ మీటింగ్.. అసెంబ్లీ రద్దుపై తేల్చని సీఎం

అనారోగ్యం నుంచి కోలుకున్న అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, వైద్యులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని సోనియాకు సూచించారు. వైద్యుల సూచన మేరకు సోనియా గాంధీ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ విచారణకు హాజరుకాలేనని, విచారణను మరికొన్ని వారాలపాటు వాయిదా వేయాలని సోనియా లేఖ రాశారు. మరోవైపు రాహుల్ గాంధీని ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే ఐదు రోజులపాటు విచారించారు.

ట్రెండింగ్ వార్తలు