England vs India: రిష‌బ్ పంత్ అద్భుత ఆట‌తీరుపై స‌చిన్, గంగూలీ, సెహ్వాగ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

టీమిండియా బ్యాట్స్‌మ‌న్ రిష‌బ్ పంత్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. అతి తక్కువ ఓవ‌ర్ల‌కే ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు భారత్ టాప్ ఆర్డ‌ర్‌ వికెట్లు స‌మ‌ర్పించుకున్న‌ప్ప‌టికీ రిష‌బ్ పంత్ క్రీజులో నిల‌దొక్కుకుని 113 బంతుల్లో 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

England vs India: టీమిండియా బ్యాట్స్‌మ‌న్ రిష‌బ్ పంత్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ వేదిక‌గా నిన్న‌ జ‌రిగిన‌ మూడో వ‌న్డే మ్యాచులో ఆతిథ్య జ‌ట్టుపై టీమిండియా గెల‌వ‌డంలో బ్యాట్స్‌మ‌న్ రిష‌బ్ పంత్ కీల‌క పాత్ర‌పోషించిన విష‌యం తెలిసిందే 260 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా అతి త‌క్కువ ఓవ‌ర్ల‌కే ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు టాప్ ఆర్డ‌ర్‌ వికెట్లు స‌మ‌ర్పించుకున్న‌ప్ప‌టికీ రిష‌బ్ పంత్ క్రీజులో నిల‌దొక్కుకుని 113 బంతుల్లో 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

హార్దిక్ పాండ్యా కూడా రాణించ‌డంతో మరో 47 బంతులు, 5 వికెట్లు మిగిలి ఉండగానే భార‌త్ ల‌క్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీమిండియాకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ, పంత్ ఆట‌తీరును కొనియాడుతూ ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు ట్వీట్లు చేశారు. ”వ‌న్డే సిరీస్ గెలిచినందుకు టీమిండియాకు శుభాకాంక్ష‌లు. ఇలాగే ఫాంను కొన‌సాగించండి. రిష‌బ్ పంత్‌, హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడారు” అని స‌చిన్ పేర్కొన్నారు.

”రిష‌బ్ పంత్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. హార్దిక్ పాండ్యా ఆ్ రౌండ్ ప్ర‌దర్శ‌న అద్భుతం. టీమిండియా చాలా బాగా ఆడింది. సిరీస్ గెలిచినందుకు శుభాకాంక్ష‌లు” అని గంగూలీ ట్వీట్ చేశారు. ”వ‌న్డే సిరీస్‌లోని చివ‌రి మ్యాచు, రిష‌బ్ పంత్ ఆట‌తీరు అత్య‌ద్భుతం. అసాధార‌ణ ఆట‌గాడి వ‌ల్ల‌ అసాధార‌ణ ఇన్నింగ్స్ చూశాం. హార్దిక్, జ‌డేజా నుంచి మంచి మ‌ద్ద‌తు ల‌భించింది” అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. వీరితో పాటు పలువురు స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్ బ్యాటింగ్ తీరును కొనియాడారు.

England vs India: మూడో వ‌న్డేలో ర‌వీంద్ర జ‌డేజా ప‌ట్టిన క్యాచ్ వీడియో వైర‌ల్

ట్రెండింగ్ వార్తలు