Sushmita Konidela: మెగా డాటర్ వెబ్ ఫిల్మ్ ప్రయత్నాలు.. తమిళ హిట్ సినిమా రీమేక్?

ఉత్తరాదిన ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసురాళ్లు ఎంట్రీ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయిన సంగతి తెలిసిందే. కానీ మన దగ్గర మాత్రం ఇంకా ఇది అనుకున్నంత సులభం కావడం లేదు. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల ఫ్యామిలీల నుండి వారసురాళ్లు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే..

Sushmita Konidela: ఉత్తరాదిన ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసురాళ్లు ఎంట్రీ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయిన సంగతి తెలిసిందే. కానీ మన దగ్గర మాత్రం ఇంకా ఇది అనుకున్నంత సులభం కావడం లేదు. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల ఫ్యామిలీల నుండి వారసురాళ్లు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఇప్పటికే అరడజను మంది వారసులు వెండితెర మీదకి వచ్చారు. నాగబాబు కుమార్తె నిహారికా కూడా హీరోయిన్ గా ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకోగా మళ్ళీ రీఎంట్రీ ఉంటుందా అనేదాని మీద క్లారిటీ లేదు.

అయితే.. మరో మెగా డాటర్, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఇండస్ట్రీలో చాలాకాలంగా తెరవెనుక యాక్టివ్ గా ఉంటున్నారు. తండ్రి చిరంజీవి, సోదరుడు రామ్ చరణ్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సుస్మిత నిర్మాతగా కూడా రాణించాలని ప్రయత్నిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా స్థాపించిన సుస్మిత ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ నిర్మించారు. కాగా ఇప్పుడు ఆమె మరో వెబ్ ఫిల్మ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా వినిపిస్తుంది. ఇప్పటికే ఆ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారట.

2017లో తమిళంలో వచ్చిన ‘8 తొట్టక్కల్’ సినిమా అక్కడ మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు సుస్మిత ఆ సినిమాను వెబ్ ఫిల్మ్ గా తెలుగులోకి రీమేక్ చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే ఈ రీమేక్ కోసం దర్శకుడిగా పవన్ సాథినేని ఖరారు కాగా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. క్యాస్టింగ్ అండ్ రీమేక్ మార్పుల పనులు పూర్తయితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. ఇక ఈ వెబ్ ఫిల్మ్ సక్సెస్ అయితే సుస్మిత నిర్మాతగా వెండితెర మీద కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడం గ్యారంటీ అని తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు