swimming pool: స్విమ్మింగ్‌పూల్‌లో బాలుడు మృతిపై తల్లిదండ్రుల ఆందోళన.. ఉద్రిక్తత

హైదరాబాద్, నాగోల్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో పడి పదేళ్ల బాలుడు ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. తమ కుమారుడి మృతికి బాధ్యులైన స్విమ్మింగ్‌పూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు.

swimming pool: హైదరాబాద్, నాగోల్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో పడి పదేళ్ల బాలుడు ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. తమ కుమారుడి మృతికి బాధ్యులైన స్విమ్మింగ్‌పూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు. స్విమ్మింగ్‌పూల్‌ వద్ద టెంట్ వేసుకుని నిరసనకు దిగారు. ఘటన జరిగి 24 గంటలు కావస్తున్నా బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్‌పూల్‌ యాజమాన్యం, అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

Hyderabad : మహిళపై దాడి ముగ్గురు యువతులు అరెస్ట్

ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆందోళనకు సంబంధించిన సమాచారం అందుకున్న చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ అక్కడికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని బాధితులను కోరారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ, తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని, అధికారులు స్పందించేంతవరకు అక్కడ్నుంచి వెళ్లేది లేదని బాలుడి తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్‌కు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, పోలీసులు లంచం తీసుకున్నారని, అందుకే యాజమాన్యానికి మద్దతుగా మాట్లాడుతున్నారని బాధితులు ఆరోపించారు.

Hyderabad : హైదరాబాద్‌లో పబ్‌లు,బార్లకు కొత్త రూల్స్-పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్
ఎలా జరిగింది?
కాగా, ఘటన జరిగిన విధానాన్ని తల్లిదండ్రులు వివరించారు. వారి కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరో నలుగురు పిల్లలతో కలిసి మనోజ్ అనే బాలుడిని స్విమ్మింగ్‌పూల్‌ తీసుకొచ్చారు. గంటకు రెండు వందల రూపాయల చొప్పున ఐదుగురికి కలిపి వెయ్యి రూపాయలు చెల్లించారు. అయితే, ఐదుగురు పిల్లల్లో ఇద్దరికి మాత్రమే ట్యూబ్స్ ఇచ్చారు. చనిపోయిన మనోజ్ అనే బాలుడికి ట్యూబ్ ఇవ్వలేదు. ట్యూబ్ లేకుండానే మనోజ్ నీటిలో దిగాడు. కొద్దిసేపటి తర్వాత మనోజ్ కనిపించడం లేదని వెతికారు. ఈ క్రమంలో పూల్‌లో ఈత కొడుతున్న వాళ్ల కాళ్లకు బాలుడు తగలడంతో వెంటనే బయటకు తీశారు. అప్పటికే బాలుడు నీళ్లు మింగి, అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే బాలుడు చనిపోయాడు.

ట్రెండింగ్ వార్తలు