Lokesh Kanagaraj Planning a Short Film about Lokesh Cinematic Universe
Lokesh Kanagaraj : తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ఖైదీ, విక్రమ్, లియో.. లాంటి పలు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చుకొని ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక సినిమాకు ఇంకో సినిమాకు లింక్ ఇస్తూ తన సినిమాపై అంచనాలు పెంచాడు. లోకేష్ రాబోయే సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక లోకేష్ చేతిలో ఇప్పటికే అరడజను సినిమాలు ఉన్నాయి.
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ తో ‘కూలి’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు లోకేష్. అయితే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఒక షార్ట్ ఫిలిం రాబోతుందని తమిళ మీడియా సమాచారం. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి వివరించడానికి, దానికి సంబంధించిన ఓ ఆసక్తి కథతో, అసలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కథలన్నీ ఎక్కడ మొదలయ్యాయి అనే కాన్సెప్ట్ తో షార్ట్ ఫిలిం రానుంది.
Also Read : Music Shop Murthy : డీజేగా మారిన అజయ్ ఘోష్.. మ్యూజిక్ షాప్ మూర్తి సాంగ్ విన్నారా?
ఇప్పటికే లోకేష్ కనగరాజ్ ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ పూర్తిచేశారు. ఈ షార్ట్ ఫిలింకు తమిళ్ లో ‘పిళ్లైయార్ సుజి’ అనే టైటిల్ పెట్టారని తెలుస్తుంది. దీని అర్ధం ది బిగినింగ్ అని. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎక్కడ మొదలయిందో చూపించబోతున్నాడు కాబట్టే దీనికి ఈ పేరు పెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ షార్ట్ ఫిలింలో అర్జున్ దాస్, నరేన్, కాళిదాస్ జయరామ్..లతో పాటు పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ షార్ట్ ఫిలిం గురించి ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ కనగరాజ్ మిగిలిన వివరాలు తెలుపుతారని సమాచారం. మరి ఈ షార్ట్ ఫిలిం యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారా? లేక ఏదైనా ఓటీటీకి ఇస్తారా చూడాలి.