Ram Charan: RRR సమయంలోనే చరణ్-సుకుమార్ కొత్త సినిమా షూటింగ్ పూర్తి.. సంచలన నిజాలు బయటపెట్టిన సుకుమార్ అసిస్టెంట్..

టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. కాగా వీరిద్దరి కలయికలో మరో సినిమా ఉండబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తుండగా, తాజాగా మరో అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే, చరణ్-సుకుమార్ ల కొత్త సినిమా షూటింగ్ ఆల్రెడీ కొంత భాగం చిత్రీకరణ జరుపుకుందట.

Ram Charan: టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. కాగా వీరిద్దరి కలయికలో మరో సినిమా ఉండబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తుండగా, తాజాగా మరో అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే, చరణ్-సుకుమార్ ల కొత్త సినిమా షూటింగ్ ఆల్రెడీ కొంత భాగం చిత్రీకరణ జరుపుకుందట.

Ram Charan : 70 ఏళ్ళ జపాన్ వీరాభిమానితో రామ్ చరణ్

RRRలో రామ్ చరణ్ మేక్ ఓవర్ అందర్నీ ఆకట్టుకుంది. హాలీవుడ్ ఆడియన్స్ కూడా చరణ్ బాడీకి ఫిదా అయిపోతున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ సమయంలో చరణ్ చూసిన దర్శకుడు సుకుమార్.. తన తదుపరి సినిమాలో రామ్ చరణ్ మేక్ ఓవర్ అలాగే కావాలని, RRR షూటింగ్ పూర్తి అయిన తరువాత సుకుమార్, చరణ్ పై ఒక ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ చిత్రీకరించాడట.

ఈ విషయాన్ని సుకుమార్ అసిస్టెంట్.. ‘క్లబ్ హౌస్’ మీడియా చాట్ లో బయటపెట్టాడు. కాగా ఇదే విషయాన్ని రాజమౌళి.. “సుకుమార్ సినిమాలో చరణ్ ఇంట్రడక్షన్ సీన్ మాములుగా ఉండదు” అంటూ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ప్రస్తావించాడు. దీంతో రామ్ చరణ్ 16వ సుకుమార్ తో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్త విన్న మెగా అభిమానులు అయితే మరో రంగస్థలం లోడింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు