Copy Content : కాపీ చేస్తే చాలు.. నెటిజన్లు పట్టేస్తున్నారు..

కాపీ అని తెలిస్తే చాలు కూపీ లాగడం ఎక్కువవుతోంది సినిమా పరిశ్రమకి సంబంధించి. ముఖ్యంగా కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ, ఇంట్రడక్షన్ సింగిల్ కానీ, పోస్టర్ అండ్ లోగో రిలీజైతే చాలు.. అది దేనికి కాపీ, అది ఎక్కడినుంచి తీసుకున్నారు అని.....................

Copy Content :  కాపీ అని తెలిస్తే చాలు కూపీ లాగడం ఎక్కువవుతోంది సినిమా పరిశ్రమకి సంబంధించి. ముఖ్యంగా కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ, ఇంట్రడక్షన్ సింగిల్ కానీ, పోస్టర్ అండ్ లోగో రిలీజైతే చాలు.. అది దేనికి కాపీ, అది ఎక్కడినుంచి తీసుకున్నారు అని వెతికి రచ్చ చేస్తున్నారు ట్రోలర్స్.

ఏదైనా పెద్ద సినిమా వస్తోందంటే అందులో పోస్టర్, షాట్స్, ట్యూన్స్ అన్నీ అందరూ చాలా నిశిత దృష్టిలో పరిశీలిస్తూంటారు. అంతేకాదు యాంటి హీరో ఫ్యాన్స్ ఏదన్నా ఆధారం దొరికితే ట్రోలింగ్ చేసేస్తూంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ట్రోలింగ్ మొదలైపోతుంది. ఎక్కడో చోట కాపీ అనో మరొకటి అనో సోషల్ మీడియా జనం రచ్చ రచ్చ చేస్తూంటారు. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఈ కల్చర్ మరీ ఎక్కువైంది.

రీసెంట్ గా నటసింహ బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీర సింహారెడ్డి’ నుంచి ‘రాజసం నీ ఇంటిపేరు’ అనే ఇంట్రడక్షన్ లిరికల్ సాంగ్ రిలీజైంది. రామజోగయ్య శాస్త్రి రాసిన పాటకు తమన్ సంగీతం అందించాడు. అయితే ఆ పాటలోని జై బాలయ్య జై బాలయ్య అంటూ సాగే లైన్ .. ‘ఓసేయ్ రాములమ్మ’ సినిమాలోని ఒసేయ్ రాములమ్మ లైన్ ట్యూన్ ను లిఫ్ట్ చేశాడంటూ ట్రోలర్స్ అటాక్ చేశారు. అలాగే ఈ విషయంలో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రికి ట్రోలింగ్ సెగ తగలడంతో ఆయన హర్ట్ అవుతూ ట్వీట్ కూడా చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోంది. ఆ మధ్య ఈ సినిమా టీజర్ రిలీజైంది. దాంతో దానిపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. దాని విఎఫ్ఎక్స్ షాట్స్, యానిమేటెడ్ క్యారక్టర్స్ లా ఉన్నాయని, ఆ టీజర్ లోని ఒకో షాట్ ను తీసుకొని అది ఏ సినిమాలోని షాట్ కు కాపీనో రిలీల్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు ట్రోలర్స్. అంతేకాదు గ్రీన్ మ్యాట్‌లో సినిమాను తీసేసి దానికి టెక్నాల‌జీ ప‌రంగా పేర్లు చెబితే ఫ్యాన్స్‌కి ఎలా న‌చ్చుతుంద‌ని కామెంట్స్ చేశారు. గ‌తంలో సూప‌ర్ స్టార్ రజినీకాంత్ చేసిన కొచ్చడ‌యాన్‌తో ఈ సినిమాను పోల్చుతూ కూడా కామెంట్స్ వచ్చాయి.

 

టాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవీశ్రీ ప్రసాద్, SS తమన్.. పాటల విషయంలో తరచుగా ట్రోలింగ్స్ కు గురవుతుంటారు. పాట జనంలోకి వెళ్ళడం ముఖ్యం కానీ, దాని కాపీ కంప్లైంట్స్ తో మాకేం పని అన్నట్టు ఉంటోంది ఆ ఇద్దరి వ్యవహారం.

 

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత హిట్టయిందో అందులోని ఐటెమ్ సాంగ్ కూడా అంతే హిట్టైందని తెలిసిందే. ఊ అంటావా మావా.. ఊ.. ఊ అంటావా మావా అంటూ మొదలయ్యే ఆ సాంగ్ ప్రేక్షకులను విపరితంగా ఆకట్టుకుంది. అయితే అదే సమయంలో ఈ పాట కాపీ అని కామెంట్స్ వినిపించాయి. ఈ స్పెషల్ సాంగ్ అచ్చం సూర్య హీరోగా నటించిన “వీడొక్కడే” సినిమాలోని ‘హానీ.. హానీ’ పాటలా ఉందని రచ్చ చేశారు నెటిజెన్స్. యూట్యూబ్ లో వీడియోలు వదిలి ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.

Manjima-Gautham Wedding : మంజిమా మోహన్-గౌతమ్ కార్తీక్ వెడ్డింగ్ గ్యాలరీ..

ఇక థమన్ విషయానికొస్తే మహేశ్ బాబు ‘సర్కార్ వారి’ పాట కోసం మమ మహేశా… సాంగ్ లోని చరణం యాజ్ టీజ్ గా ‘సరైనోడు’ సినిమాలోని సిలకలూరు సింతామణి సాంగ్ చరణంలోని ట్యూన్ నే దింపేసి చేతులు దులుపుకోవడంతో మహేశ్ ఫ్యాన్స్ థమన్ పైన కోపంగా ఉంటే, యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేసి ఆడుకుంటున్నారు. అయినా తమన్ వేరే వారి ట్యూన్స్ లిఫ్ట్ చేయడం మానడం లేదు. ఇలా ఈ ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ తమ ప్రతి ఆల్బమ్ లోను ఏదో ఒక కాపీ మ్యూజిక్ ఇచ్చి దొరికిపోతున్నా ప్రస్తుతం వీళ్ళ ఫామ్ కి వచ్చిన ఢోకా మాత్రం ఏం లేదు. ఇక సినిమాల్లో సన్నివేశాలు కూడా హాలీవుడ్, కొరియా సినిమాల్లోంచి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టిన సందర్భాలని కూడా చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు