Pushpa : ‘పుష్ప’ కోసం ఎవరు ఎంతెంత తీసుకుంటున్నారంటే!..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న మూడో సినిమా.. ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రష్మిక మందన్న కథానాయిక.. పాపులర్ మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు..

Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న మూడో సినిమా.. ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రష్మిక మందన్న కథానాయిక.. పాపులర్ మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు..

ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.. బన్నీ బర్త్‌డేకి రిలీజ్ చేసిన టీజర్ అదిరిపోయిందంటూ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.. రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.. బన్నీ, సుక్కు, దేవి కాంబో అంటే మ్యూజికల్ మేజిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు..

అయితే ఈ సినిమాకి సంబంధించి మెయిన్ స్టార్ కాస్ట్ అండ్ డైరెక్టర్ రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ కనిపిస్తున్నాయి.. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం వీరి పారితోషికాల వివరాలు ఇలా ఉన్నాయి.. బన్నీ – రూ. 35 కోట్లు, సుకుమార్ – రూ. 25 కోట్లు, ఫాహద్ ఫాజిల్ – రూ. 5 కోట్లు, రష్మిక – రూ. 2 కోట్లు తీసుకుంటున్నారట.. ముందుగా ఆగస్టు 13న సినిమాను రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదాపడే అవకాశముందని తెలుస్తోంది..

ట్రెండింగ్ వార్తలు