Vodafone-idea : వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్.. దేశంలో Vi 5G ఫస్ట్ సర్వీసులు ప్రారంభం.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

Vodafone-idea : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) ఎట్టకేలకు భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించింది.

Vodafone-idea : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) ఎట్టకేలకు భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించింది. వోడాఐపోన్ ఐడియా Vi 5G దేశ రాజధాని ఢిల్లీలో అందుబాటులో ఉందని కంపెనీ కస్టమర్ సపోర్ట్ టీమ్ ట్విట్టర్‌లో వెల్లడించింది. ప్రస్తుతం, Vi 5G అందుబాటులో ఉన్న ఏకైక సిటీ ఇదే. ఇప్పటివరకు, వోడాఫోన్ ఐడియా 5G కమర్షియల్ రోల్‌అవుట్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

ప్రస్తుతానికి, మరిన్ని నగరాల్లో Vi 5G సపోర్ట్‌ను అందించున్నట్టు ఎలాంటి సమాచారం లేదు. టెలికాం కంపెనీ కస్టమర్ సపోర్ట్ టీమ్ ట్విట్టర్‌లో Vi అనేక నగరాలకు 5Gని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని తెలిపింది. త్వరలో Vi 5G ప్లాన్లను వెల్లడిస్తుందని ధృవీకరించింది. ఈ ట్వీట్‌ను ఫస్ట్ టెలికామ్‌టాక్ రివీల్ చేసింది.

మరోవైపు.. జియో 5G భారత్‌లోని 78 నగరాల్లో అందుబాటులో ఉంది. రిలయన్స్ జియో ఈ ఏడాది చివరి నాటికి భారత్ అంతటా 5Gని అందజేస్తామని తెలిపింది. ఎందుకంటే దాదాపు ప్రతిరోజూ కొత్త నగరాలు జాబితాలోకి చేరుతున్నాయి. జియో కన్నా ఎయిర్‌టెల్ వెనుకబడి ఉంది. దాని 5G సర్వీసులు ఇప్పటివరకు 22 భారతీయ నగరాలకు మాత్రమే చేరుకుంది.

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో 5G ప్లాన్ల పూర్తి లిస్టు మీకోసం.. 5G డేటా పొందాలంటే ఇలా చేయండి!

ఈ కంపెనీల్లో ఏవైనా స్టేబుల్ 5G సర్వీసులను పొందవచ్చా? టెలికాం కంపెనీలు చాలా మంది కస్టమర్లకు 5G సర్వీసులను అందిస్తున్నాయి, కాల్ డ్రాప్ సమస్యలు వంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. 5Gని వినియోగించడంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే నిమిషాల్లో డేటాను కోల్పోతున్నామని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. 5G 4G కన్నా చాలా వేగవంతమైనది. కాబట్టి మీరు పూర్తి కంటెంట్‌ను వినియోగించక ముందే సెకన్లలో ప్రతిదీ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత బఫర్ అవుతుంది. కొన్ని నిమిషాల్లోనే చాలా డేటా అయిపోతుందని చెబుతున్నారు.

Vodafone-idea starts rolling out 5G services in India

రిలయన్స్ జియో Jio 5G ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, పూణే 66 ఇతర నగరాల్లో అందుబాటులో ఉంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వారణాసి, గురుగ్రామ్, గౌహతి, లక్నో, అహ్మదాబాద్, పూణే, ఇండోర్, మరికొన్ని నగరాల్లో ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లు 5Gని యాక్సెస్ చేయవచ్చు.

5G-సపోర్టెడ్ ఫోన్‌ని కలిగిన యూజర్లు 5Gని యాక్టివేట్ చేసేందుకు మొబైల్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లో ఎనేబుల్ చేయొచ్చు. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు డిఫాల్ట్‌గా 5G/4G/3G నెట్‌వర్క్ సెట్టింగ్‌కి సెట్ అవుతాయి. తద్వారా మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న నెట్‌వర్క్ ప్రకారం మీ మొబైల్ వర్క్ చేస్తుంది. ఒకవేళ మీ 5G ఫోన్ 5G నెట్‌వర్క్ ఆప్షన్ చూపకపోతే, మీ డివైజ్ యూనిట్ ఇంకా 5G సపోర్ట్ అప్‌డేట్‌ను అందుకోలేదని అర్థం. మీరు ఫోన్ సాఫ్ట్‌వేర్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా 5G ఎనేబుల్ అయిందో లేదో చెక్ చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Vodafone Idea New Plans : వోడాఫోన్ ఐడియా నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఇందులో ఏ ప్లాన్ బెటర్ అంటే?

ట్రెండింగ్ వార్తలు