Election Commission: ఇక ఇంటి నుంచే ఓటు వేయొచ్చు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త వెసులుబాటు

224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 36 స్థానాలు ఎస్సీ రిజర్వుడు కాగా 15 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. ఇక రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్లు ఓటర్లు ఉండగా ఇందులో 2.59 ఓటర్లు మహిళలు. ఇక 16,976 మంది ఓటర్లు వందేళ్లకు పైబడినవారు, 4,699 మంది ఓటర్లు థర్డ్ జెండర్

Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగులో ఒక కొత్త వెసులుబాటును పరిచయం చేసింది. ఈ వెసులుబాటు ప్రకారం.. ఇక నుంచి ఇంటి వద్ద ఉండే ఓటు వేయొచ్చు. అయితే ఇది అందరికీ వర్తించదు. 80 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుందని ఈసీ తెలిపింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తీసుకువచ్చిన ఈ వెసులుబాటు అమలు తీరుపై శనివారం ఈసీ వివరాలు వెల్లడించింది.

Land for Jobs Scam: ఆసుపత్రిలో గర్భిణీ భార్య.. సీబీఐ విచారణకు రానన్న తేజశ్వీ యాదవ్

ఈ విషయమై భారత ముఖ్య ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ‘‘భారత చరిత్రలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 80 ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. 12డీ ఫాం తీసుకుని ఎన్నికల సిబ్బందే వారి ఇంటికి వెళ్తారు. అనంతరం వారి నుంచి ఓటు తీసుకుంటారు. చాలా మంది వృద్ధులు నడవలేని స్థితిలో ఓటు వేసేందుకు రారు. అయితే ఓటింగులో వారి ప్రాధాన్యాన్ని పెంచడానికే తాజా నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారు.

Tihar jail : మనీశ్ సిసోడియాను ఉంచిన తీహార్‌ జైలులో సర్జికల్‌ బ్లేడ్లు, ఫోన్లు, డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఖైదీ..

అయితే ఈ ఓటింగు ప్రక్రియ అత్యంత రహస్యంగా జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీడియో తీసి పెడతామని తెలిపారు. ఇంటి నుంచి ఓటు వేసే వారు ఎవరైనా ఉంటే అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం అందిస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు. ఇక వికలాంగులకు ‘సాక్షం’ అనే మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అయ్యి, వారి ఓటు హక్కును వినియోగించుకోవచ్చట. ఇదే కాకుండా ‘సువిధ’ అనే మొబైల్ యాప్ కూడా ఉందని, దీని ద్వారా అభ్యర్థులను ఆన్ లైన్ ద్వారా నామినేషన్లు, అఫిడవిట్లు దాఖలు చేయొచ్చని రాజీవ్ కుమార్ తెలిపారు.

Raj Bhavan Tension : రాజ్‌భవన్ దగ్గర టెన్షన్ టెన్షన్.. బారికేడ్లను తోసేస్తున్న మేయర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు

224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 36 స్థానాలు ఎస్సీ రిజర్వుడు కాగా 15 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. ఇక రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్లు ఓటర్లు ఉండగా ఇందులో 2.59 ఓటర్లు మహిళలు. ఇక 16,976 మంది ఓటర్లు వందేళ్లకు పైబడినవారు, 4,699 మంది ఓటర్లు థర్డ్ జెండర్. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 9.17 లక్షల మంది ఓటర్లు కొత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మేలో జరగనున్న ఈ ఎన్నికల కోసం మొత్తం 58,272 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 1,320 పోలింగు బూతులు మహిళల పర్యవేక్షణలో ఉంటాయి. 224 యువకుల పర్యవేక్షణలో ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు