యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 300 మ్యాచులు ఆడిన 11వ భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున చాహల్ ఆడుతున్నాడు. ఉప్పల్లో సన్రైజర్స్ హైదారాబాద్ తో మ్యాచ్ ద్వారా చాహల్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
No small feat. 🐐 pic.twitter.com/wHmKHcZc2R
— Rajasthan Royals (@rajasthanroyals) May 2, 2024
టీ20ల్లో అత్యధిక మ్యాచులు ఆడిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 436 టీ20 మ్యాచులు ఆడాడు. ఆ తరువాతి స్థానాల్లో దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు.
T20 World Cup 2024 : కేఎల్ రాహుల్ కంటే సంజూ శాంసన్ బెటర్.. కుండబద్దలు కొట్టిన అజిత్ అగార్కర్
టీ20ల్లో అత్యధిక మ్యాచులు ఆడిన భారత ఆటగాళ్లు..
రోహిత్ శర్మ – 436 మ్యాచులు – 11471 పరుగులు
దినేష్ కార్తీక్ – 396 మ్యాచులు – 7343 పరుగులు
ఎంఎస్ ధోని – 387 మ్యాచులు – 7367 పరుగులు
విరాట్ కోహ్లీ – 386 మ్యాచులు – 12494 పరుగులు
సురేష్ రైనా – 336 మ్యాచులు – 8654 పరుగులు
శిఖర్ ధావన్ – 334 మ్యాచులు – 9797 పరుగులు
రవీంద్ర జడేజా – 319 మ్యాచులు – 3539 పరుగులు
అంబటి రాయుడు – 303 మ్యాచులు – 6176 పరుగులు
మనీష్ పాండే – 302 మ్యాచులు – 6849 పరుగులు
యుజ్వేంద్ర చాహల్ – 300 మ్యాచులు – 349 వికెట్లు
ఈ రికార్డు మ్యాచ్లో చాహల్ విఫలం అయ్యాడు. నాలుగు ఓవర్లు వేసి 62 పరుగులు సమర్పించుకున్నాడు.