Asia Cup 2025 : ఆసియాక‌ప్ 2025 మ్యాచ్‌ల‌ను ఫ్రీగా ఎక్క‌డ‌ చూడొచ్చొ తెలుసా?

మంగ‌ళ‌వారం నుంచి ఆసియా క‌ప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలోని మ్యాచ్‌ల‌ను..

Asia Cup 2025 : ఆసియాక‌ప్ 2025 మ్యాచ్‌ల‌ను ఫ్రీగా ఎక్క‌డ‌ చూడొచ్చొ తెలుసా?

Do you where to watch Asia Cup 2025 matches free here is details

Updated On : September 5, 2025 / 4:02 PM IST

Asia Cup 2025 : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఆసియా క‌ప్ 2025 టోర్నీకి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. మ‌రో నాలుగు రోజులు అంటే సెప్టెంబ‌ర్ 9 నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. యూఏఈ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. 8 జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే ఈ టోర్నీలోని మ్యాచ్‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది. ఫైన‌ల్ మ్యాచ్ సెప్టెంబ‌ర్ 28న జ‌ర‌గ‌నుంది.

సూర్య‌కుమార్ యాద‌వ్ నాయ‌క‌త్వంలో భార‌త జ‌ట్టు బ‌రిలోకి దిగ‌నుంది. గ్రూప్ ఏలో భార‌త్‌తో పాటు పాక్‌, ఒమ‌న్‌, యూఏఈ లు ఉన్నాయి. భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను సెప్టెంబ‌ర్ 10న ఆతిథ్య యూఏఈతో ఆడ‌నుంది. దుబాయ్ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌రువాత చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాక్‌తో సెప్టెంబ‌ర్ 14న టీమ్ఇండియా త‌ల‌ప‌డ‌నుంది. ఇక లీగ్ ద‌శ‌లో చివ‌రి మ్యాచ్‌ను సెప్టెంబ‌ర్ 19న ఒమ‌న్‌తో ఆడ‌నుంది. ఆ త‌రువాత సూప‌ర్ 4 ద‌శ ప్రారంభం కానుంది.

Hardik Pandya new look : క్రికెట్ ఆడేందుకు వెళ్తున్నావా? ఫ్యాషన్ షోకా? ఆ జ‌ట్టు ఏంది? ఆసియా కప్‌కు ముందు హార్దిక్ పాండ్యా న్యూ లుక్..

భార‌త మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే..?

వాస్త‌వానికి షెడ్యూల్ ప్ర‌క‌టించిన స‌మ‌యంలో మ్యాచ్‌లు అన్ని భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ప్ర‌స్తుత్తం అక్క‌డ ఎండాకాలం కావ‌డంతో.. వేడిని దృష్టిలో ఉంచుకుని అరగంట ఆల‌స్యంగా ప్రారంభం కానున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. అంటే భార‌త కాల‌మానం ప్ర‌కారం మ్యాచ్‌లు రాత్రి 8 గంట‌ల నుంచి ప్రారంభం అవుతాయి.

ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం ఎక్క‌డంటే?

భార‌త దేశంలో ఆసియాక‌ప్ 2025 మ్యాచ్‌ల ప్ర‌సార హ‌క్కులు సోని నెట్‌వ‌ర్క్ సొంతం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో టీవీల్లో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్‌లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కానున్నాయి. ఆన్‌లైన్‌లో సోనీ లివ్ యాప్‌, వైబ్‌సైట్‌లో మ్యాచ్‌ల‌ను చూడొచ్చు.

Chinnaswamy Stadium : చిన్న‌స్వామి స్టేడియంలో మ‌ళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు.. కానీ కండీష‌న్స్ అప్లై..

ఫ్రీగా ఎలా చూడొచ్చంటే..?

టీమ్ఇండియా విదేశాల్లో ఆడే మ్యాచ్‌ల‌ను డీడీ స్పోర్ట్స్‌లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేస్తుంది అన్న సంగ‌తి తెలిసిందే. డీడీ స్పోర్ట్స్‌లో మ్యాచ‌ల‌ను ఉచితంగా చూడొచ్చు.

ఆసియా క‌ప్ షెడ్యూల్ 2025 (Asia Cup 2025) ఇదే..

* సెప్టెంబరు 9న – అఫ్గానిస్తాన్‌ వర్సెస్‌ హాంగ్‌కాంగ్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 10న – భార‌త్‌ వర్సెస్‌ యూఏఈ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 11న – బంగ్లాదేశ్‌ వర్సెస్‌ హాంగ్‌కాంగ్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 12న – పాకిస్తాన్‌ వర్సెస్‌ ఒమన్ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 13న – బంగ్లాదేశ్‌ వర్సెస్‌ శ్రీలంక – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 14న – భార‌త్ వర్సెస్‌ పాకిస్తాన్ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 15న – యూఏఈ వర్సెస్‌ ఒమన్ – అబుదాబి (సాయంత్రం 5.30 నిమిషాలకు)
* సెప్టెంబరు 15న – శ్రీలంక వర్సెస్‌ హాంగ్‌కాంగ్ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబ‌ర్ 16న – బంగ్లాదేశ్ వ‌ర్సెస్ అఫ్గానిస్తాన్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంట‌ల‌కు)
* సెప్టెంబరు 17న – పాకిస్తాన్‌ వర్సెస్‌ యూఏఈ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 18న – శ్రీలంక వర్సెస్‌ అఫ్గానిస్తాన్‌ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 19న – భార‌త్‌ వర్సెస్‌ ఒమన్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)

Ross Taylor : రాస్ టేల‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రిటైర్‌మెంట్ వెన‌క్కి.. న్యూజిలాండ్‌కు మాత్రం ఆడ‌ను..

సూపర్ 4 స్టేజ్‌..

* సెప్టెంబరు 20న – గ్రూప్‌-బి టాపర్‌ వర్సెస్‌ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2) – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 21న – గ్రూప్‌-ఎ టాపర్‌ వర్సెస్‌ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2) – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 23న – A2 vs B1- దుబాయ్ ( రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 24 – A1 vs B2 – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 25న – A2 vs B2 – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 26న – A1 vs B1 – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 28న – ఫైనల్ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)