Hardik Pandya new look : క్రికెట్ ఆడేందుకు వెళ్తున్నావా? ఫ్యాషన్ షోకా? ఆ జట్టు ఏంది? ఆసియా కప్‌కు ముందు హార్దిక్ పాండ్యా న్యూ లుక్..
ఆసియాకప్ 2025కి ముందు హార్దిక్ పాండ్యా న్యూ లుక్ (Hardik Pandya new look) వైరల్ అవుతోంది. తన జట్టును చిన్నగా..

Hardik pandya new look ahead of asia cup 2025 goes viral
Hardik Pandya new look : మరో నాలుగు రోజుల్లో ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. యూఏఈ ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబర్ 10న తలపడనుంది. కాగా..ఈ టోర్నీలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషిస్తాడని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆసియాకప్ 2025కి ముందు హార్దిక్ పాండ్యా సరికొత్త లుక్‌తో (Hardik Pandya new look) ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. తన హెయిర్ స్టైల్‌ను పూర్తిగా మార్చేశాడు. కొత్త హెయిర్ స్టైల్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నేను కొత్తగా’ అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు.
Chinnaswamy Stadium : చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు.. కానీ కండీషన్స్ అప్లై..
హార్దిక్ తన జట్టును పొట్టిగా కత్తిరించుకున్నాడు. దానికి సాండీ బ్లోండ్ (sandy blonde )కలర్ వేయించుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అతడి కొత్త హెయిర్ స్టైల్ ను ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్, వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్‌తో పోల్చుతున్నారు. ఇంకొందరు మాత్రం హార్దిక్ ను విమర్శిస్తున్నారు. ఆసియా కప్ 2025కి ఆడేందుకు వెళ్తున్నావని, ఫ్యాషన్ షోకి కాదని సెటైర్లు వేస్తున్నారు.
భారత్, పాక్ మ్యాచ్..
ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.