Tristan Stubbs : విచిత్రమైన ఔట్ నుంచి తృటిలో తప్పించుకున్న ట్రిస్టన్ స్టబ్స్.. ఆశ్చర్యపోయిన బౌలర్.. వీడియో వైరల్
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ట్రిస్టన్ స్టబ్స్ (Tristan Stubbs)కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ENG vs SA 2nd ODI Tristan Stubbs narrowly avoided a freak dismissal
Tristan Stubbs : లండన్‌లోని లార్డ్స్ మైదానంలో గురువారం దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ (Tristan Stubbs) తృటిలో ఔట్ కాకుండా తప్పించుకున్నాడు. ఓ బంతిని షాట్ ఆడిన క్రమంలో అతడు బ్యాట్ పై నియంత్రణ కోల్పోయాడు. గాల్లోకి లేచిన బ్యాట్ కింద పడి వికెట్లకు తగిలే సమయంలో స్టబ్స్ తన చేతులతో బ్యాట్‌ను పక్కకు నెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 31వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను సాకిబ్ మహమూద్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఓ బంతికి స్టబ్స్ బ్యాక్ ఫుట్ డిఫెన్సివ్ షాట్ ఆడాడు. అయితే.. బ్యాట్ పై పట్టు కోల్పోయాడు. బ్యాట్ అతడి చేతుల్లోంచి ఎగిగిపోయి స్టంప్స్‌కు దగ్గరగా పడింది. వికెట్ల పై పడకుండా స్టబ్స్ అడ్డుకున్నాడు. స్టబ్స్ అదృష్టాన్ని బౌలర్ సాకిబ్ నమ్మలేనట్లుగా కనిపించించాడు. ఈ వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మాథ్యూ బ్రీట్జ్కే (85), ట్రిస్టన్ స్టబ్స్ (58) లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు వికెట్లు తీయగా ఆదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టాడు. జాకబ్ బెథెల్ ఓ వికెట్ సాధించాడు.
How on earth has that missed? 🤯
Tristan Stubbs you’re a lucky boy! 😅 pic.twitter.com/sSMSLpwifM
— England Cricket (@englandcricket) September 4, 2025
Ross Taylor : రాస్ టేలర్ సంచలన నిర్ణయం.. రిటైర్‌మెంట్ వెనక్కి.. న్యూజిలాండ్‌కు మాత్రం ఆడను..
ఆ తరువాత జోరూట్ (61), జోస్ బట్లర్ (61), జాకబ్ బెథెల్ (58) రాణించినా ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నాంద్రే బర్గర్ మూడు, కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు తీశాడు. కార్బిన్ బాష్, సెనూరన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి లు తలా ఓ వికెట్ పడగొట్టారు.