Lionel Messi : సొంతగడ్డపై మెస్సీ చివరి మ్యాచ్ ఆడేశాడా? ఫిఫా ప్రపంచకప్ 2026 ఆడనట్లేనా?
అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ (Lionel Messi) సొంత గడ్డపై చివరి మ్యాచ్ ఆడేశాడా అంటే..

Lionel Messi Drops Bombshell On Playing FIFA World Cup 2026
Lionel Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ అదరగొట్టాడు. FIFA ప్రపంచ కప్ 2026 క్వాలిఫైయర్‌లో భాగంగా సొంతగడ్డ పై జరిగిన చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో దుమ్ములేపాడు.
ఈ మ్యాచ్‌లో వెనిజులాపై అర్జెంటీనా జట్టు 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. అర్జెంటీనా విజయంలో మెస్సీ కీలక పాత్ర పోషించాడు. రెండు గోల్స్ సాధించాడు. అతడు 39, 80 నిమిషాల్లో గోల్స్ చేశాడు. మ్యాచ్ ముగిసిన తరువాత మెస్సీ ఎమోషనల్ అయ్యాడు. దీంతో సొంత గడ్డ పై అతడికి ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా భావిస్తున్నారు.
Asia Cup 2025 : ఆసియాకప్ 2025 మ్యాచ్‌లను ఫ్రీగా ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
వచ్చే ఏడాది జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 అనంతరం మెస్సీ ఆటకు వీడ్కోలు పలుకుతాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ మెగాటోర్నీకి కెనడా, మెక్సీకో, యునైటెడ్ స్టేట్స్ ఆతిథ్యం ఇస్తున్నాయి. రిటైర్‌మెంట్ వార్తలు నిజమైతే మెస్సీకి సొంత గడ్డపై ఇదే చివరి మ్యాచ్.
మ్యాచ్ అనంతరం మెస్సీ ( Lionel Messi) మాట్లాడుతూ.. ఈ మైదానంలో తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయన్నాడు. అర్జెంటీనాలో సొంత ప్రజల మధ్య ఆడడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉంటానన్నాడు. ఇక్కడ ఎన్నో మ్యాచ్‌లను ఆడానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానన్నాడు. ఇక్కడ ఈ విధంగా పూర్తి చేయడం తాను ఎప్పుడూ కలల కనే విషయం అని చెప్పుకొచ్చాడు.
వరల్డ్ కప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు..
ఫిఫా వరల్డ్ కప్ 2026 గురించి మాట్లాడుతూ.. ఈ మెగాటోర్నీలో ఆడాలా వద్దా అనే విషయం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. ‘ప్రస్తుతం సీజన్ పూర్తి చేస్తాను. ఆ తరువాత ప్రీ సీజన్ ఉంది. అనంతరం ప్రపంచకప్‌కు మరో ఆరు నెలల సమయం ఉంటుంది. అప్పటికి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ‘అని మెస్సీ అన్నాడు.