Alekhya Tarakratna : 23 రోజులు కొన ఊపిరితో నా కోసమే ఉన్నారు.. ఆయన చివరి హార్ట్ బీట్ కూడా విన్నా..
అలేఖ్య ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పింది. (Alekhya Tarakratna)
Alekhya Tarakratna
- అలేఖ్య మొదటి ఇంటర్వ్యూ
- తారకరత్న చివరి జర్నీ గురించి చెప్పిన అలేఖ్య
Alekhya Tarakratna : తారకరత్న 2023లో యువగళం పాదయాత్రలో డీ హైడ్రేషన్ వచ్చి పడిపోయి హాస్పిటల్ లో చేరి అనంతరం సీరియస్ అవ్వడంతో బెంగుళూరుకి తరలించి అక్కడ మూడు వారాలకు పైగా చికిత్స అందించారు. చికిత్స తీసుకుంటూనే తారకరత్న మరణించారు. ఆయన మరణం కుటుంబానికి, పార్టీకి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తారకరత్న మరణం తర్వాత ఎక్కువగా బయటకు రాని ఆయన భార్య అలేఖ్య మొదటిసారి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.
అలేఖ్య ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పింది. ఈ క్రమంలో తాను హాస్పిటల్ లో ఉన్నప్పుడు, తారక్ కి అలా జరిగిందని తెలిసినప్పుడు తన పరిస్థితి ఎలా ఉందని చెప్పుకొచ్చింది.
Also Read : Prabhas : మలయాళం దర్శకుడితో ప్రభాస్ సినిమా.. రొయ్యల బిర్యానీ పెట్టి మరీ..
Alekhya Tarakratna
అలేఖ్య మాట్లాడుతూ.. ఆయన జనవరి 25నే వెళ్ళాలి యువగళం పాదయాత్రకు. కానీ అనుకోకుండా రెండు రోజుల తర్వాత జనవరి 27న వెళ్లారు. ఆ రోజు శుక్రవారం. ఆయన ఉదయం వెళ్లారు. సాయంత్రానికి వచ్చేస్తా అన్నారు. పొద్దున్నే ఫోన్ చేసారు. సాయంత్రం వచ్చి పిల్లలతో సినిమా చూస్తా అన్నారు. కానీ కొంతసేపటికి తారక్ కి డీ హైడ్రేషన్ అయిందని చెప్పి ఫోన్ వచ్చింది. మా అమ్మ కాల్ చేసి బాల బాబాయ్ కి ఫోన్ చేయమంటే చేశా. బాల బాబాయ్ కూడా అదే చెప్పారు. తర్వాత విజయ్ సాయి రెడ్డి బాబాయ్ ఫోన్ చేసి నిష్క(అలేఖ్య పెద్ద కూతురు)ని తీసుకొని కుప్పం వెళ్లమన్నారు. అప్పుడు చంద్రబాబు గారు ఫోన్ చేసారు. ఆయన కాల్ చేసేటప్పటికీ ఆయన అంతా బిజీగా ఉండి నాకు ఫోన్ చేసే సరికి ఏదో సీరియస్ అని అర్థమైంది. నేను కుప్పం వెళ్ళాను.
అక్కడ తారకరత్నని బెడ్ మీద చూసి అలా కుప్పకూలిపోయాను. బాల బాబాయ్ దగ్గరుండి నన్ను అడిగే అన్ని చేసారు. ఆయనే అన్ని దగ్గరుండి చూసుకున్నారు. మా అన్నయ్య బెస్ట్ హాస్పిటల్ కి తీసుకెళ్దాం అన్నారు. దాంతో బెంగుళూరు తీసుకెళ్లారు. ఆయన 23 రోజులు హాస్పిటల్ లోనే ఉన్నారు. చాలా ఫైట్ చేసారు. నా కోసమే నాకు టైం ఇవ్వడానికే అన్ని డేస్ ఫైట్ చేశారేమో అనిపిస్తుంది. నా కోసం అందరూ హాస్పిటల్ లోనే ఉన్నారు. నేనే అందర్నీ వెళ్లిపొమ్మని అన్నాను. డాక్టర్ వచ్చి అంతా అయిపోయింది అని చెప్పాక ఫస్ట్ బాల బాబాయ్ కి ఫోన్ చేసి చెప్పాను. తర్వాత అందరికి చెప్పాను. తారకరత్నతో చివరి నిమిషం వరకు ఉన్నాను. ఆయన బెడ్ మీదే నేను పక్కనే పడుకొని ఆయన లాస్ట్ హార్ట్ బీట్ కూడా విన్నాను. చాలా నెలల వరకు అసలు ఆయన లేరు అని యాక్సెప్ట్ చేయలేకపోయాను అంటూ ఎమోషనల్ అయింది.
Also Read : Alekhya : కుంకుమ పెట్టుకోవద్దు అన్నారు.. వెళ్లకూడదని డిసైడ్ అయ్యా.. తారకరత్న చనిపోయాక అలేఖ్య ఇబ్బందులు..
