RC 17 : RC 17లో చిరంజీవి స్పెషల్ రోల్?
RC 17 : మెగా పవర్ స్టార్ రామ్చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న RC17 సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొంటున్నాయి
IS Mega Star Chiranjeevi special role in RC 17
RC 17 : మెగా పవర్ స్టార్ రామ్చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న RC17 సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించడంతో, మరోసారి ఈ కాంబో ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే ఆసక్తి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగం కానున్నారనే ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిరంజీవి ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన సర్ప్రైజ్ రోల్లో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
Rahul Sipligunj : దసరా రోజున కొత్త కారు కొన్న రాహుల్ సిప్లిగంజ్.. ఫోటోలు వైరల్..
ఒకవేళ చిరు రోల్ ఉంటే మాత్రం మెగా అభిమానులకు ఇది పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. రామ్చరణ్ సినిమాలో చిరంజీవి కనిపించడంతో పాటు, తండ్రీకొడుకు ఒకే తెరపై కనిపిస్తే అభిమానులు ఫుల్ ఖుష్ అవడం పక్కా. ముఖ్యంగా సుకుమార్ తన సినిమాల్లో పాత్రలను తీర్చిదిద్దే విధానం, కథలో కీలకమైన మలుపులను తీసుకొచ్చే శైలి నేపథ్యంలో చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతోందనే చర్చ మొదలైంది.
అయితే ఈ సర్ప్రైజ్ రోల్పై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రచారం మాత్రమే. RC17లో నిజంగానే మెగాస్టార్ సందడి చేయనున్నారా? అన్నది అధికారిక స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
